»   »  అరుదైన రికార్డ్ : మహేష్ తర్వాత నాగార్జునే

అరుదైన రికార్డ్ : మహేష్ తర్వాత నాగార్జునే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున ఈ వయస్సులోనూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో స్టామినా చూపించి అరుదైన రికార్జుని క్రియేట్ చేసారు. ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో టచ్ లో ఉన్న ఆయన ...అక్కడ అరుదైన రికార్జుని క్రియేట్ చేసారు. నాగార్జున తాజాగా ట్విట్టర్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ని క్రాస్ చేసి రికార్డు క్రియేట్ చేసాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇప్పటి వరకూ టాలీవుడ్ లో మహేష్ బాబు మాత్రమే 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసాడు, మహేష్ బాబు తరవాత నాగార్జునకి ఆ రికార్డ్ దక్కింది. వీరిద్దరి తర్వాత పవన్ కళ్యాణ్(4.6 లక్షలు), ఎన్.టి.ఆర్ (3.6లక్షల) ఫాలోవర్స్ తో ఉన్నారు.

ఈ నలుగురు హీరోస్ రెగ్యులర్ గా ట్వీట్స్ రాయకపోయినా వీరికి ఫాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంది. నాగార్జున ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా, కార్తీ - వంశీ పైడిపల్లి సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Nagarjuna achieves a rare milestone

నాగార్జున కొత్త చిత్రం విషయానికి వస్తే...

గతంలో నాగార్జున, రాఘవేంద్రరావు ల కాంబినేషన్ లో అన్నమయ్య చిత్రం వచ్చింది. వెంకటేశ్వరస్వామి భక్తుడుగా..తాళ్లపాక అన్నమాచార్యునిగా అందులో జీవించారు నాగార్జున. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలో కనిపించనున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఆయన 'ఏడు కొండలవాడు' అనే టైటిల్ తో ఓ భక్తిరస ప్రధాన చిత్రం కమిటయ్యారని సమచారం.

గతంలో నాగార్జునతో షిర్డీ సాయి చిత్రం నిర్మించిన మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎప్పటిలాగే రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రూపొందనుంది. ఇలాంటి చిత్రాల రచనలో అందె వేసేన చెయ్యి అయిన భారవి సైతం ఈ ప్రాజెక్టుకు పనిచేస్తున్నట్లు సమాచారం. ఏప్రియల్ నుంచిషూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్తున్నారు.

అయితే ఇందులో వెంకటేశ్వరస్వామిగానే నాగార్జున కనిపిస్తారని వెంకటేశ్వర మహత్యం చిత్రం తరహా పౌరాణిక గాధ అని వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజముందనేది ప్రాజెక్టు ఫైనలైజ్ అయ్యి అధికారిక ప్రకటన వచ్చేకే తెలుస్తుంది.

ప్రస్తుతం నాగార్జున చేస్తున్న చిత్రం విషయానికి వస్తే...

నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా'. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో హాట్ హీరోయిన్ హంసా నందిని నటిస్తుంది. కొన్ని రోజులు షూటింగులో కూడా పాల్గొంది. తన పాత్ర వివరాలు వెల్లడించలేనని, నేను గతంలో నటించిన పాత్రల కంటే భిన్నమైన పాత్ర అని హంసా తెలిపింది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే అంగీకరించిందట.

లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ కధానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్' తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.

English summary
Akkineni Nagarjuna crossed the much celebrated 1 million followers mark on Twitter yesterday and he now joins Mahesh Babu, the only other Telugu star who achieved this rare milestone.
Please Wait while comments are loading...