»   » ప్రముఖ డైరెక్టర్ కూతురితో అఖిల్.. అమల బాలీవుడ్ ఎంట్రీ.. ఆసక్తికరంగా నాగార్జున

ప్రముఖ డైరెక్టర్ కూతురితో అఖిల్.. అమల బాలీవుడ్ ఎంట్రీ.. ఆసక్తికరంగా నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu
"Akkineni Amala Is Going To Act In Bollywood" Nagarjuna Says

అక్కినేని వారింట్లో నాగ చైతన్య, సమంత పెళ్లి వేడుక కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు పెళ్లి ఏర్పాట్లపై దృష్టి పెడుతూనే నాగార్జున త్వరలో విడుదల కాబోతున్న రాజు గారి గది2 సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ప్రముఖ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది1కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, సమంత, సీరత్ కపూర్ తదితరులు నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 13న రిలీజ్ కానున్న నేపథ్యంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఆయన వెల్లడించిన విషయాలు ఇవే.

డిసెంబర్ 22న హలో..

డిసెంబర్ 22న హలో..

అక్టోబర్‌ 15న హలో షూటింగ్‌ పూర్తి చేసేస్తానని దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ చెప్పారు. డిసెంబర్‌ 22న సినిమా విడుదలవుతుందని ముందే థియేటర్స్‌కు కూడా చెప్పేసుకున్నాం. డైరెక్టర్‌ విక్రమ్‌కు ఉదయం, సాయంత్రం ఫోన్‌ చేస్తున్నాను. ఏమైందని అడుగుతున్నాను. బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీ. సినిమా చాలా బాగా వస్తుంది.

అఖిల్ సరసన కళ్యాణి

అఖిల్ సరసన కళ్యాణి

హలో చిత్రంలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ కూతురు కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ప్రియదర్శిన్‌గారు నాతో, అమలతో నిర్ణయం సినిమా చేశారు. ఈ మధ్య ఆయన నాకు ఫోన్‌ చేసి అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

అన్న‌పూర్ణ ఫిలిం స్కూల్ గురించి

అన్న‌పూర్ణ ఫిలిం స్కూల్ గురించి

అన్నపూర్ణ ఫిలిం స్కూల్‌లో స్క్రిప్ట్‌ విభాగాన్ని ఒకదాన్ని రెడీ చేశాం. దానికంటూ కొంత ఫండ్‌ కేటాయించాం. ఫిలిం స్కూల్‌ స్టూడెంట్సే స్క్రిప్ట్‌ తయారు చేస్తారు. వాళ్లే నటీనటులు, దర్శకులు, టెక్నికల్‌ టీంగా వ్యవహరిస్తారు. మా స్టూడియో నుంచి సినిమాను నిర్మిస్తాం. ఈ ప్రాసెస్‌ వచ్చే ఏడాది నుండి ప్రారంభం అవుతుంది. స్టూడెంట్స్‌ కోసం క్వాలిటీ ఫ్యాక్టలీస్‌ను తీసుకొస్తున్నాం. అలాగే గెస్ట్‌ లెక్చరర్స్‌ కూడా ఉన్నారు.

బాలీవుడ్‌లో అమల ఎంట్రీ

బాలీవుడ్‌లో అమల ఎంట్రీ

అమల కూడా తన సమయాన్ని స్కూల్‌కు కేటాయిస్తుంది. లేటెస్ట్‌ టెక్నాలజీ తెలుసుకోవాలని అమల మళ్లీ సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు ఓ బాలీవుడ్‌ సినిమాలో నటిస్తుంది. త్వరలోనే అమల నటించే బాలీవుడ్ చిత్ర వివరాలను వెల్లడిస్తాం అని నాగార్జున చెప్పారు.

చందు మొండేటితో సినిమా చేస్తా

చందు మొండేటితో సినిమా చేస్తా

దర్శకుడు చందు మొండేటితో తప్పకుండా సినిమా చేస్తాను. తను నాకు పెద్ద ఫ్యాన్‌. తనని అభిమానిలా కాకుండా డైరెక్టర్‌లా సినిమా చేద్దామని అన్నాను. పోలీస్‌ క్యారెక్టర్‌ స్టోరీ చెప్పాడు. అలాగే సవ్యసాచి కథ కూడా విన్నాను. స్టోరీ లైన్‌ ఎంతో బావుంది.

English summary
Nagarjuna Akkineni's Latest movie is Raju Gari Gadhi2. Omkar is the director. This movie is slated to release on October 13. In this occassion, Recenly Nagarjuna met with media and said that Amala is going to act in Bollywood movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu