»   » పక్కన కోడలు ఉంది.. అవేం మాటలు.. యాంకర్‌కు నాగ్ వార్నింగ్!

పక్కన కోడలు ఉంది.. అవేం మాటలు.. యాంకర్‌కు నాగ్ వార్నింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్నటి వరకు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, అందాల తార సమంత తోటి నటీనటులు. నాగచైతన్యతో పెళ్లి తర్వాత వారిద్దరి బంధం మామ, కోడళ్లు. ఇదంతా తెలిసిందే.. మరెందుకు చెప్తున్నారంటే.. మీడియా అత్యుత్సాహం కొన్నిసార్లు సినీ స్టార్లకు ఇబ్బంది కలుగ జేస్తుంది. పక్కన ఎవరున్నారు అనే విషయం పక్కన పెట్టి ఒళ్లు మరిచిపోయే నోటికి వచ్చేసింది వాగుతుంటారు యాంకర్లు. తాజాగా అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితే నాగార్జునకు ఎదురైంది. దాంతో నాగార్జున సుతి మెత్తగా మందలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఇంటర్వ్యూ కోసం నాగార్జున, సమంత

ఇంటర్వ్యూ కోసం నాగార్జున, సమంత

రాజుగారి గది2 చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ ప్రముఖ చానెల్‌కు నాగార్జున, సమంత ఇంటర్వ్యూ కోసం వెళ్లారు. సినిమా గురించి బాగానే మాట్లాడుకొన్నారు. మధ్యలో అత్యుత్సాహం ప్రదర్శించిన యాంకరమ్మ అడగకూడని ప్రశ్నను అడిగి కష్టాలు కోరి తెచ్చుకొన్నది. అసలేం జరిగిందంటే..

 మీసాలు తీసేసిన నాగార్జున

మీసాలు తీసేసిన నాగార్జున

నాగ చైతన్య పెళ్లికి ముందు నాగార్జున మీసాలు తీసేసిన సంగతి తెలిసిందే. ఆ విషయం మీడియాలో చర్చనీయాంశమైన సంగతీ తెలిసిందే. తాజాగా ఆ విషయాన్ని మరోసారి యాంకర్ ప్రస్తావిస్తూ మీసాలు తీయడానికి కారణమేంటి అని అడిగారు. అయితే అమ్మాయిలందరూ బాగుంది అంటున్నారు అందుకే అలా ఉంచుకొన్నాను అని సమాధానమిచ్చారు.

 మీకు నచ్చలేదా యాంకర్‌కు ప్రశ్న

మీకు నచ్చలేదా యాంకర్‌కు ప్రశ్న

అంతటితో నాగ్ ఆగకుండా మీకు నచ్చలేదా అని ప్రశ్నించారు. అందుకు యాంకర్ సమాధానమిస్తూ చాలా బాగుంది. కాకపోతే మన్మధుడికి మీసం ఉంటే రొమాంటిక్‌గా ఉంటుంది కదా అని అన్నారు. అంతటితో ఆగిపోతే యాంకర్‌కు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదు. మరింత ఉత్సాహం ప్రదర్శించి నాగచైతన్యకు పోటీగా వయసు తగ్గిద్దామని ప్రయత్నిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు నాగార్జునకు చెర్రెత్తుకొచ్చింది.

 నాగార్జునకు కోపం వచ్చింది..

నాగార్జునకు కోపం వచ్చింది..

నాగార్జున ఆ సమయంలో తన కోపాన్ని తగ్గించుకొని.. సమంతను చూపిస్తూ.. పక్కన కోడలు ఉంది. బి హేవ్ యువర్ సెల్ఫ్ (జాగ్రత్తగా మాట్లాడండి) అని సున్నితంగా మందలించినా అది వార్నింగ్ మాదిరిగానే కనిపించింది. అయితే ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతుంది.

 నాగ్, సమంత న్యాయం చేశారు..

నాగ్, సమంత న్యాయం చేశారు..

నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాజు గారి గది2'. తాజాగా విడుదలైంది. అయితే ఈ చిత్రంపై డివైడ్ టాక్ పరిశ్రమలో వినిపిస్తున్నది. నాగార్జున, సమంత తన పాత్రలకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశారు అని అభిమానులు, సినీ విమర్శకులు చెప్పుకొంటున్నారు.

English summary
Nagarjuna's Raju Gari Gadhi2 released on Octorber 13. On the occassion of release, Nagarjuna, Samantha went to Television Channel to promote this movie. In the interview Anchor asked one question about mustaches. But Nagarjuna reposnded seriously to Anchor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu