»   » నాగ్ నన్ను సెక్సీ అంటారు..మమతా మోహన్ దాస్

నాగ్ నన్ను సెక్సీ అంటారు..మమతా మోహన్ దాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున నన్ను సెక్సీ, బ్యూటీ అంటూ పిలుస్తూంటారు. ఆయనకు నా నటన అంటే ఇష్టం..అంటూ తాను కేడీ చిత్రంలో నాగార్జున సరసన ఎంపికకావటానికి కారణం చెప్పుకొచ్చింది మమతామోహన్ దాస్. "కింగ్"లో నేను నాగ్ సోదరుని భార్యగా నటించాను...పాత్రలో లీనమైన తీరు నాగ్‌ను బాగా ఆకట్టుకుంది. దాంతో ఆమెకు ఎలాగైనా తర్వాత చిత్రంలో ఆఫర్ ఇవ్వాలని "కేడి" చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. అలాగే మీడియా వద్ద నన్ను నచ్చిన హీరోయిన్ గా చెప్పారంటూ మురిసిపోతోంది. అలాగే నాలో నటన,గానం మాత్రమే కాక ఇంకో ఎన్నో నైపుణ్యాలు ఉన్నాయంటూ ఎంకరేజ్ చేస్తారు. ఎప్పటికప్పుడు ఇంకాబాగా చేయి మంచి భవిష్యత్ ఉందంటూ చెప్తూంటారు. బాగా కష్టపడితే పైకొస్తావ్ అని కూడా చెపుతుంటారు. ఏదైమైనా తోటి నటులను ఎంకరేజ్ చేసే నాగ్ చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో ఎన్ని చిత్రాలు చేయడానికైనా నేను రెడీ" అంటూ మనసులో మాట బయిటపెట్టింది మమత.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu