»   » మార్కెట్ యార్డ్ నడిపే వ్యక్తి గా నాగార్జున

మార్కెట్ యార్డ్ నడిపే వ్యక్తి గా నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

'హాలో బ్రదర్‌', 'అల్లరి అల్లుడు' తరహాలో చిత్రాలు చేయాలని చాలా రోజులుగా నా మనసులో ఉంది. అలాంటి చిత్రాలకు యాక్షన్‌ని జోడిస్తే ఎలా ఉంటుందో 'రగడ' చిత్రంలో చూడొచ్చు అంటున్నారు నాగార్జున. ఆయన తాజా చిత్రం 'రగడ' గురించి చెబుచతూ. అలాగే 'రగడ' లో రొమాంటిక్‌ సన్నివేశాలు కూడా ఉంటాయి. కడపలో మార్కెట్ యార్డ్ నడిపే వ్యక్తిగా నటిస్తున్నా. అందుకే నా పాత్రకి రాయలసీమ యాస పెట్టాడు డైరెక్టర్ అన్నారు. ఇక . 'గీతాంజలి' సినిమాలోని 'జగడ జగడ జగడం చేసేస్తాం' పాటలోని 'రగడ', 'గగనం' అనే పదాలతో ఇప్పుడు రెండు సినిమాలు నావి వస్తున్నాయి.అలాగే ఈ సినిమా ప్రారంభం నుంచే సక్సెస్ కళ కనిపిస్తోంది. తమన్ మ్యూజిక్ బాగా చేశాడు. ఎనిమిదో వింతగా ఇటీవల ప్రకటించిన జోర్డాన్‌లో పాటలు తీయడానికి వెళ్లబోతున్నాం. ఈ సినిమాలో యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉంది అన్నారు.

ఇక ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రఘుబాబు, ప్రదీప్ రావత్, దేవ్ గిల్, సుశాంత్ సింగ్, సత్యప్రకాశ్, సుప్రీత్, శ్రావణ్, డా. భరత్‌రెడ్డి, రఘు, వెన్నిరాడై నిర్మల, శ్రీలలిత, సన తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: తమన్ ఎస్., కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, ఫైట్స్: విజయ్, కొరియోగ్రఫీ: రాజు సుందరం, లారెన్స్, శోభి, దినేశ్, నిర్వహణ: కె. చెంచురెడ్డి, సహ నిర్మాతలు: డి. విశ్వచందన్‌రెడ్డి, డి. వెంకటకైలాష్‌రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరు పోట్ల. నవంబరులో పాటల్ని, డిసెంబరు 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు చెప్పుకొచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu