»   » అనుష్క, భూమిక మా ద్వారానే...నాగార్జున

అనుష్క, భూమిక మా ద్వారానే...నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

"అనుష్క, భూమిక మా అన్నపూర్ణ బేనర్‌ ద్వారానేగా హీరోయిన్స్ గా పరిచయమయ్యారు. ఇప్పుడు వాళ్లిద్దరూ ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. హైదరాబాద్‌ లో జరిగిన 'తకిట తకిట' చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నాగార్జున పైవిధంగా స్పందించారు. అలాగే...భూమిక భర్త భరత్‌ ఠాకూర్‌తో నాకెప్పట్నుంచో అనుబంధం వుంది. తను 'తకిట తకిట' సినిమా ద్వారా నిర్మాతగా మారుతున్నందుకు ఆనందంగా వుంది. ఈ పాటలు కొత్తగా ఉన్నాయి. వినసొంపుగా వున్నాయి. ఈ పాటలు, సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని నాగార్జున అన్నారు.

డౌన్ ‌టౌన్‌ ఫిలింస్‌ పై భూమిక సమర్పణలో భూమిక భర్త భరత్‌ఠాకూర్‌ నిర్మించిన చిత్రం 'తకిట తకిట'. కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రంలో భూమిక అతిథి పాత్ర చేయగా నాగార్జున, అనుష్క ప్రత్యేక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి బోబో శశి సంగీతం అందించారు. ఈ ఆడియో సీడీని నాగార్జున ఆవిష్కరించారు. ఈ వేడుకలో సురేష్‌ బాబు, స్రవంతి రవికిషోర్‌, కెఎల్ నారాయణ, 'ఠాగూర్‌' మధు, నల్లమలుపు శ్రీనివాస్‌, మెహర్‌ రమేష్‌, 'మధుర' శ్రీధర్‌, సైనా నెహ్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. డా డి.రామానాయుడు జ్యోతి ప్రజ్వలన చేయగా, టైటిల్‌ లోగోను కెఎల్ నారాయణ ఆవిష్కరించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu