»   »  ఆ రెండు సినిమాలు వాయిదా వెనక నాగార్జున హ్యాండ్?

ఆ రెండు సినిమాలు వాయిదా వెనక నాగార్జున హ్యాండ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కిన ‘శంకరా భరణం' మూవీ వాస్తవానికి దీపావళికి విడుదల కావాల్సి ఉంది. అఖిల్ సినిమా విడుదల ఉండటంతో నవంబర్ 20కి వాయిదా వేసారు. ఇపుడు ఏకంగా డిసెంబర్ 4కు పోస్ట్ పోన్ చేసారు. కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం' మూవీ కూడా దీపావళికి విడుదల కావాల్సి ఉండగా ఉండగా ‘అఖిల్'కు లైన్ క్లియర్ చేయాలని రిలీజ్ ఈ నెల 20కి వాయిదా వేసారు. దీంతో 20న విడుదల కావాల్సిన శంకరాభరణం డిసెంబర్ 4కు పోస్ట్ పోన్ చేసారు.

‘శంకరా భరణం' సినిమాను డిసెంబర్ 4కు వాయిదా వేసామని, కేవలం ‘అఖిల్' సినిమాకు గ్రాండ్ వెల్ కం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోన వెంకట్ ప్రకటించారు. అదే సమయంలో ‘చీకటి రాజ్యం' సినిమాను నవంబర్ 20కి వాయిదా వేసామని, తమిళ వెర్షన్ యధావిధిగా నవంబర్ 10న విడుదలవుతుందని తెలిపారు.

మరో వైపు తమిళంలో అజిత్ నటించిన ‘వెండలమ్' తెలుగులో ‘ఆవేశం' పేరుతో విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేక పోవడం ఆగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలన్నింటి వాయిదా వేనక నాగార్జున హ్యాండ్ ఉన్నట్లు సమాచారం.

Nagarjuna Behind All Release Delays?

తన వారసుడు ‘అఖిల్' తెరంగ్రేటం చేస్తున్న సినిమా కావడంతో నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి తన కొడుకు సినిమాకు పోటీగా నిలుస్తాయనుకున్న ఇతర సినిమాలను రిక్వెస్ట్ చేసి వాయిదా వేయించారని అంటున్నారు. ఒక సినిమా విషయంలో నాగార్జున ఈ రేంజిలో లాబీ జరుపడం ఇదే తొలిసారి అని టాక్.స

వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖిల్' సినిమాలో అఖిల్ అక్కినేని, సాయేషా జంటగా నటిస్తున్నారు. యంగ్ హీరో నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పెద్ద హీరోల సినిమాలతో సమానంగా భారీ బడ్జెట్ ఖర్చు చేయించారు. భారీ తారాగణం, పాపులర్ టెక్నిషియన్స్, ఫారన్ షూటింగుల కోసం బాగా ఖర్చు చేసారు.

గతంలో ఏ స్టార్ హీరో వారసుడికీ లేనంతగా అఖిల్ అక్కినేని సొంతంచేసుకోవడం గమనార్హం. సినిమా విడుదల ముందే ఈ చిత్రం రూ. 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమాపైనే తన కొడుకు సినీ భవిష్యత్ ఆధార పడి ఉండటంతో నాగార్జున వీలైనంత వరకు కిందకి దిగాడని అంటున్నారు. అఖిల్ సక్సెస్ అయితే భవిష్యత్తులో ప్రస్తుతం మహేష్ బాబు లాగా.... టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదుగుతాడని అంటున్నారు.

English summary
Kona Venkat confirmed that Shankarabaranam is pushed to December 4th only to facilitate a grand welcome for Akhil Akkineni's debut flick. At the same time, today Kamal Haasan confirmed that his Cheekati Rajyam got pushed to 20th November, while Tamil version Thoongavanam will release on 10th November as planned. Latest update is that even Ajith's Vendalam Telugu version Avesham is also not making its Telugu release. Buzz says, all these postponements are happening due to requests from King Nagarjuna.
Please Wait while comments are loading...