For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళి దర్శకత్వంలో అఖిల్ సినిమాపై నాగ్

  By Srikanya
  |

  హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో అఖిల్ సినిమా ఉంటుందని బయట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో నాగార్జున ముందు ఈ విషయం మీడియా వారు ఉంచారు. దానికి నాగార్జున సమాధానమిస్తూ...అలాంటిందే లేదు... రాజమౌళిగారబ్బాయ్, కీరవాణి గారబ్బాయ్, అఖిల్ ముగ్గురూ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్లు ముగ్గురూ సరదాగా అప్పుడప్పుడూ షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటారు. అఖిల్‌కి యాక్టింగ్ ఇంట్రస్ట్. రాజమౌళిగారబ్బాయికి డెరైక్షన్ ఇంట్రస్ట్. కీరవాణిగారబ్బాయ్ సంగీతంలో చాలా టాలెంటెడ్. వయొలిన్ బాగా ప్లే చేస్తాడు. ఈ ముగ్గురి టీమ్ కరెక్ట్‌గా సెట్ అయ్యింది అన్నారు. అలాగే అఖిల్ ఎంట్రీకి ఇంకా సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతం డిగ్రీ చదువుకొంటున్నాడు. సినిమాలకి సంబంధించిన కోర్సులు కూడా చేస్తున్నాడు అన్నారు.

  దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అమల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో యాక్ట్ చేశారు. తెరపై ఆమెను చూడ్డానికి అందరూ వెయిటింగ్. అందరితో పాటు నేనూ వెయిట్ చేస్తున్నా. నిజానికి అమలకు మళ్లీ నటించాలనే ఆసక్తి లేదు. కానీ శేఖర్ కమ్ముల ఒప్పుకునేవరకూ వదల్లేదు. ఆ సినిమాలో అమలది చాలా మంచి రోల్ అన్నారు. ఆమెతో కలిసి నటించే అవకాశాలు గురించి చెపుతూ... తను ఇప్పుడు నా పక్కన నటిస్తే గర్ల్‌ఫ్రెండ్‌గానైనా నటించాలి. లేదంటే భార్యగానైనా నటించాలి. ఒకవేళ చేసినా మధ్యలో ఆ పాత్రను చంపేస్తారు . ఫ్లాష్‌బ్యాక్‌ పాత్రల్లో అంటే నాకే ఇష్టం లేదు. అభిమానులు కూడా ఆ తరహాలో మమ్మల్ని చూడడానికి ఇష్టపడరు. 'శివ'కి కొనసాగింపుగా ఎవరైనా 'శివ 2' కథ తీసుకొస్తే నటిస్తామేమో? అని చెప్పారు.

  'డమరుకం' విశేషాలు చెప్తూ... శివుడికీ, మనిషికీ మధ్య సాగే సోషియో ఫాంటసీ కథాంశం. అలాగని భక్తి, ఆధ్యాత్మికం తరహా విషయాలేవీ ఇందులో ఉండవు. పక్కా మాస్‌ సినిమా. 45 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఉంటాయి. 'డమరుకం' మే నెలలోనే విడుదల కావాలి. గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమైంది. నిన్ననే కొంత పోర్షన్ గ్రాఫిక్స్ చూశా. అద్భుతంగా ఉంది. ఒక పాట షూట్ చేయాలి. మంచి మాస్, కమర్షియల్ ఫిల్మ్ అవుతుంది. నాకిదే తొలి సోషియో ఫాంటసీ సినిమా.

  కొత్తగా ఒప్పుకొన్న సినిమాలు గురించి మాట్లాడుతూ...'లవ్‌స్టోరీ' పూర్తయ్యాక 'భాయ్‌' ఉంటుంది. వినోదాత్మకమైన కథ. 'హలో బ్రదర్‌' చిత్రాన్ని గుర్తుకు తెచ్చేలా ఉంటుంది. గత రెండు మూడేళ్లకంటే ఇప్పుడు మరింత బిజీగా మారిపోయాను. బెల్లంకొండ సురేష్‌ సంస్థలో ఓ చిత్రంలో నటించాలి. దుర్గా ఆర్ట్స్‌ సంస్థలోనూ ఓ చిత్రం చెయ్యాలి .ఓ పక్క 'శిరిడి సాయి' చేస్తూనే, మరో పక్క లవ్‌స్టోరీలు, సోషియో ఫాంటసీలు, మాస్ సినిమాలు చేస్తున్నారు. 'శిరిడి సాయి' తన కెరీర్‌కే ప్రత్యేకం అంటున్నారు నాగ్.

  English summary
  Nagarjuna Says that his son Akkineni Akil's entry will be in Two years. present he is busy with Film Courses.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X