»   » 'కేడీ' తృప్తి ఇవ్వలేదు...నాగార్జున

'కేడీ' తృప్తి ఇవ్వలేదు...నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను నటించిన కేడీ అనుకున్న విధంగా తృప్తినివ్వకపోయినా, నాగచైతన్య చిత్రం చూశాకా ఆనందం కలిగింది అన్నారు నాగార్జున. ఆయన హీరోగా కిరణ్ అనే నూతన దర్శకుడుని డైరక్టర్ గా పరిచయం చేస్తూ రూపొందించిన కేడీ చిత్రం భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ రిజల్ట్ మోసుకొచ్చింది. ఆ చిత్రం గురించి తాజాగా నాగార్జున అలా కామెంట్ చేసారు. ఇక తన కుమారుడు నాగ చైతన్య నటించిన తాజా చిత్రం 'ఏ మాయ చేసావె' బుధవారం ప్రత్యేకంగా షో వేసుకొని చూశారు. ఆ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

నాగచైతన్య గురించి చెబుతూ...నేను ఎక్కువగా చెప్పడం బాగుండదు. కానీ 'ఏ మాయ చేసావె' చిత్రంలో చాలా పరిణతి చెందిన హీరోలా నటించాడు. నటనలో, సంభాషణా ఉచ్ఛరణలో, డాన్స్‌ల పరంగాను చాలా ప్రతిభ కనబరిచాడు. ఆర్టిస్ట్‌కు ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. రెండో సినిమానే ఇలాంటి ఫీల్‌ వున్న మూవీ చేసిన చైతన్య అదృష్టవంతుడు అంటున్నారు నాగార్జున. జోష్‌ తో పోల్చుకుంటే ఈ సినిమాకి చైతులో చాలా మార్పు కనిపించింది. నటనలోకానీ, సంభాషణలు పలకడంలోగానీ, ప్రత్యేకంగా డాన్స్‌ విషయంలో కూడా బాగా మెరుగయ్యాడు.

అలాగే ఈ సినిమా చూసినంతసేపూ నేను నటించిన 'గీతాంజలి' చిత్రమే గుర్తొచ్చింది. నా అభిమానులందరికీ ఆ చిత్రం గుర్తొస్తుంది. అప్పట్లో గీతాంజలిపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. సినిమా అంతా చీకటిగా ఉందని ఫైట్లు లేవని హీరోకి గడ్డం ఏంటని పెదవి విరిచారు. సినిమా విజయం సాధించాకా అవే బాగున్నాయి అన్నారు. గీతాంజలికి సంగీతం ప్రాణం పోసింది. ఏ మాయ చేసావె చీకట్లో ఉన్నట్లు ఉండదు. కనువిందుగా ఉంటుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu