»   » అమల దెయ్యం కాదు.. సమంతలో దెయ్యాన్ని చైతూ చూస్తాడు.. బెడ్‌రూంలో ఎలానో.. (ఇంటర్వ్యూ)

అమల దెయ్యం కాదు.. సమంతలో దెయ్యాన్ని చైతూ చూస్తాడు.. బెడ్‌రూంలో ఎలానో.. (ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగార్జున నటించిన రాజుగారి గది2 చిత్రం అక్టోబర్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో సమంత ఆత్మగా నటిస్తున్నది. ఈ చిత్రం రాజుగారి గదికి సీక్వెల్‌గా వస్తున్నది. ఈ చిత్రానికి యాంకర్ ఓంకార్ దర్శకుడు. ఈ చిత్రం హారర్ థ్రిల్లర్‌గా, కామెడీ చిత్రంగా రూపొందుతున్నది. అనుక్షణం ఏమి జరుగుతుందో అనే ఆసక్తి ఉంటుంది. మానవ సంబంధాలకు కట్టి పడేస్తాయి అని నాగార్జున పేర్కొన్నారు. రాజుగారి గది2 గురించి చెబుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

 రాజుగారి గది2 బాగుంది.

రాజుగారి గది2 బాగుంది.

రాజు గారి గది2 సినిమా షూటింగ్ పూర్తయింది. ఫస్ట్ కాపీ చూశాను. చాలా బాగుంది. నేను ఫస్ట్ కాపీ సెప్టెంబర్ 1న చూద్దాం అనుకొన్నాను. కానీ నెల ఆలస్యం తర్వాత అక్టోబర్ 2న చూశాను. అది కొంచెం అసంతృప్తి కలిగించే అంశం.

రాజుగారి గది2 చిత్రంలో

రాజుగారి గది2 చిత్రంలో

రాజుగారి గది2 చిత్రంలో స్పెషల్ ఎఫెక్ట్స్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకొన్నాను. సినిమా ఫస్ట్ కాపీ పూర్తయితే తప్ప నేను డబ్బింగ్ చెప్తాను అనే కండీషన్ పెట్టారు.

గ్రాఫిక్స్ బాగా చేశాం

గ్రాఫిక్స్ బాగా చేశాం

ఆత్మ చుట్టూ కథ తిరుగుతుంటుంది. అందుకే గ్రాఫిక్స్ బాగా చేశాం. లేకపోతే తెర మీద చూసినప్పుడు భయం కలుగదు. ప్రేక్షకులు సినిమా డిస్‌కనెక్ట్ అవుతారు. కావున మేం కొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించాం.

థ్రిల్‌గా ఫీలవుతారు.

థ్రిల్‌గా ఫీలవుతారు.

ఓంకార్ కథ చెప్పగానే థ్రిల్ అయ్యాను. మీరు థ్రిల్‌గా ఫీలవుతారు. కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఏ విధంగా అయితే చెప్పాడో అలానే ప్రజెంట్ చేశారు దర్శకుడు. కథలో ఆత్మకు నాకు చాలా మంచి సంబంధం ఉంటుంది. చాలా కొత్త రకమైన స్టోరి.

ఆత్మతో ఆట

ఆత్మతో ఆట

హారర్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇటీవల వచ్చిన ఆనందో బ్రహ్మ చిత్రానికి మంచి రెస్పాన్ వచ్చింది. అలాంటి తరుణంలో వస్తున్న సినిమా రాజుగారి గది2. ఆత్మకు, నాకు సంబంధమేమిటి? అనే అంశాలు కొత్తగా ఉంటాయి

అదే ఆశ్చర్యం కలిగించింది

అదే ఆశ్చర్యం కలిగించింది

ఈ చిత్రంలో నేను మెంటలిస్టుగా నటిస్తున్నాను. మెంటలిస్టు గురించి చాలా పుస్తకాలు చదివాను. వాళ్ల హావభావాలను పరిశీలించాను. వారిని కలిసి వారి పనితీరు గురించి తెలుసుకొన్నాను. మన మనసులో ఉండే విషయాలను మెంటలిస్టులు ఎలా చెబుతారు అనేది నాకు ఆశ్చర్యం కలిగింది. నేను మనసులో అనుకొన్న విషయాలను ఓ మెంటలిస్టు చెప్పడం చాలా ఆశ్చర్యం వేసింది.

సమంతతో గదిలో

సమంతతో గదిలో

నాగార్జున సినిమా గురించి వివరిస్తూ ఓ ప్రశ్నకు సమాధానంగా నా కోడలును దెయ్యంగా చూడదలుచుకోలేదు. సమంతలో దెయ్యాన్ని నాగచైతన్య చూస్తాడు. ఈ సినిమాలో గదిలో కొన్నీ సీన్లు ఉంటాయి. ఆత్మ గదిలోకి వస్తుంది. అలాంటి సీన్లు చూసిన తర్వాత సమంతతో గదిలో ఎలా పడుకొంటాడో అర్థం కాదు అని నాగార్జున అన్నారు.

ఆమె చాలా అందగత్తె

ఆమె చాలా అందగత్తె

మరో ప్రశ్నకు నాగార్జున సమాధానిమిస్తూ నా భార్య అమల దెయ్యం కాదు. చాలా అందగత్తె అంటూ పొగడ్తలలో ముంచెత్తారు. సమంత దెయ్యంగా నటిస్తున్నందున నాగచైతన్య సినిమాను చూడను అని ముందే చెప్పాడు.

English summary
October Month is very special for Nagarjuna Akkineni. Nag's son Naga Chaitanya, Samantha are getting marriage on October 6 and 7th. In these occasion, Nagarjuna speaks to media exclusively. Those interview inputs for Telugu Filmibeat viewers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu