»   » అఖిల్ ట్విట్టర్ లో రాసాడు కాబట్టే..నాగార్జున

అఖిల్ ట్విట్టర్ లో రాసాడు కాబట్టే..నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున తాజాగా చేస్తున్న చిత్రానికి గగనం అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే చిత్రం తమిళంలోనూ రిలీజ్ కాబోతోంది. అయితే అక్కడ టైటిల్ మాత్రం పయినం అని పెట్టారు. రాధామోహన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని నాగార్జున వివరిస్తూ...నాగచైతన్య 'జోష్‌" సమయంలోనే దిల్‌రాజు కథ చెప్పారు. రాధా మోహన్‌ చెప్పిన కథ బాగా నచ్చింది. అప్పటికే ఈ దర్శకు డి 'ఆకాశమంత" చిత్రాన్ని చూశాను. ఆ సినిమా నచ్చి ఒప్పుకున్నా. సీరియస్‌ కథలో వినోదం బాగా పండించారు దర్శకులు.ఇక టైటిల్‌ విషయానికి వస్తే గగనం" అని అఖిల్‌ ట్విట్టర్‌లో రాసు కున్నాడు. ప్రేక్షకులకు అది బాగా చేరిపోయింది. ఎక్కువ మంది ఆ టైటిలే కావాలనుకున్నారు. చివరికి అదే తుది ఎంపిక అయింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ సెట్‌, ఎయిర్‌ బస్‌ సెట్‌ వేశారు. ప్రకాష్‌రాజ్‌, నేను ఈ చిత్రంలో పోటీపడి మరీ నటించాం. డిజిటల్‌ కెమెరా ముందు తొలిసారి నటించాము అని చెప్పారు.

Please Wait while comments are loading...