twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున 'గగనం' చిత్రం పూర్తి కథ ఏమిటి?

    By Srikanya
    |

    చెన్నై టు డిల్లీ ప్రయాణించే ఫ్లైట్ ని ఐదుగురు టెర్రరిస్టులు హైజాక్ చేస్తారుమొదటి పాకిస్దాన్ లోని రావుల్పిండిలో డైవర్ట్ చేయమన్నా..టెక్నికల్ గా ఇబ్బందులు ఎదరవటంతో తిరుపతి ఎయిర్ పోర్ట్ లో ఎమర్జన్సీ లాండింగ్ చేస్తారు. ఆ ప్లైట్ లో సిబ్బంది కాకుండా డబ్బై ఐదు మంది ప్రయాణీకులు ఉంటారు. అందులో ఓ మినిస్టర్, ఓ లీడింగ్ డాక్టర్, ఓ తండ్రి, ఓ చిన్న పిల్లాడు, అనేక కుటుంబాలు ఉంటాయి. టెర్రిరిస్టులు కాస్మీర్ జైల్లో ఉన్న తమ లీడర్ యూసఫ్ ఖాన్ ని విడిచిపెడితే ప్రయాణీకులని విడిచిపెడతామని కండీషన్ పెడతారు.అందుకు కేవలం నలభై ఎనిమిది గంటలు మాత్రమే టైమ్ ఇస్తారు. హోమ్ సెక్రటరీ విశ్వనాధ్(ప్రకాష్ రాజ్),నేషనల్ సెక్యూరిటీ ఎడ్వైజర్, మరో ఇద్దరు టాప్ బాస్ లతో కలిసి టెర్రరిస్టులతో నెగోషియేట్ చేయటానికి వస్తారు. వారితో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆఫీసర్ రవి(నాగార్జున)కూడా వస్తాడు.

    అయితే గవర్నమెంట్ కమెండో ఆపరేషన్ కి ఒఫ్పుకోకపోవటంతో సైలెంట్ గా ఉంటాడు. ఈ పరిస్ధితుల్లో హింసకు చోటివ్వకుండా గవర్నమెంట్ యూసఫ్ ఖాన్ ని విడుదల చేయటానికి సిద్దపడుతుంది. అయితే ఎయిర్ పోర్ట్ కి తీసుకు వస్తూంటే...అతను రోడ్డు యాక్సిడెంట్ లో మరణిస్తాడు. దాంతో ఏం చేయలేని పరిస్దితి ఏర్పడుతుంది. తమ వాడు చనిపోయాడని టెర్రిరిస్టులకు తెలిస్తే మరింత దారుణం జరిగే అవకాసం ఉంది. ఈ స్ధితిలో రవి పరిస్ధితుల్ని చేతిలోకి తీసుకుని హైజాకర్స్ నుంచి ప్రయాణీకులను ఎలా సేవ్ చేసాడన్నది మిగతా కథ. గంట నలభై ఎనిమిది నిముషాలు సాగే ఈ చిత్రంలో పాటులు గానీ, రొమాన్స్ కానీ మిగతా రెగ్యులర్ మసాలా ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఆకాశమంత దర్శకుడు రాధామోహన్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

    English summary
    A Chennai-New Delhi flight is hijacked by five terrorists and they demand it to be diverted to Rawalpindi, Pakistan. Due to a technical snag, it finally lands in Tirupati where they make contact with the Airport authorities. The terrorists demand the release of Yusuf Khan, an international terrorist who’s in a high security prison in Kashmir. And they give the Indian government less than 48 hours to accept their demands or face severe consequences. Then National Security Guards officer Ravi (Nagarjuna) came and solve it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X