For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగ్ ‘గ్రీకు వీరుడు’ వర్కింగ్ స్టిల్స్ సూపర్బ్ (ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రం 'గ్రీకు వీరుడు'. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ బయిటకు వచ్చాయి. ఈ స్టిల్స్ చూస్తుంటే చిత్రం ఓ రేంజిలో రూపొందుతోందనే నమ్మకం అభిమానుల్లో కలుగుతోంది. సినిమా సంతోషం లా మళ్లీ ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని అంటున్నారు. కామాక్షి మూవీస్‌ పతాకంపై డి.శివప్రసాద్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.దశరథ్‌ దర్శకుడు.

  'నిన్నే పెళ్లాడతా' చిత్రం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పాటల్లో 'గ్రీకు వీరుడు... నా రాకుమారుడు' ఒకటి. ఆ పాటలో నాగార్జున స్త్టెల్స్‌ యువతకు బాగా నచ్చాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే నాగ్‌ నటిస్తున్న చిత్రానికి 'గ్రీకు వీరుడు' అనే పేరుని ఖరారు చేసినట్లు సమాచారం. గతంలో దాసరిగారి కుమారుడు చిత్రానికి కూడా ఈ టైటిల్ ని వినియోగించారు. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.

  ఈ చిత్రంలో నాగ్‌తో నయనతార ఆడిపాడుతోంది. ఈ చిత్రానికి గతంలో 'లవ్‌స్టోరీ', 'సరిలేరు నీకెవ్వరు' పేర్లు పరిశీలించారు. అయితే నాగ్‌ శైలికి, కథకి 'గ్రీకు వీరుడు' అనే పేరు అయితే మరింత బాగుంటుందని చిత్ర బృందం భావించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాల్ని త్వరలో విడుదల చేయబోతున్నారు.

  ఈ చిత్రంలో నాగార్జున ఈవెంట్ మేనేజర్ గా కనిపించనున్నారని సమాచారం.

  హీరోయిన్ నయనతారది పిల్లల వైద్యనిపుణురాలి పాత్ర.

  నాగ్, నయనతార మధ్య జరిగే సన్నివేశాలు యువతరాన్ని ఓ రేంజ్‌లో అలరిస్తాయని చెప్తున్నారు. మన్మధుడు చిత్రం తరహాలో సీన్స్ ఫన్నీగా ఉంటాయని అంటున్నారు.

  కథ ప్రకారం.. ఈవెంట్ మేనేజర్ గా చేస్తున్న నాగార్జున... అక్కడ ఓ ఈవెంట్ లో భారీగా దెబ్బతినటంతో ఇండియాలో ఉన్న తన ఆస్తిని అమ్మి రికవరీ చేసుకుందాని వస్తారు. ఈ జర్నిలో నయనతార పరచయమవుతుంది.

  అక్కడ నుంచి నయనతారతో నాగార్జున పరిచయం ఎలా ముందుకెళ్లింది. డబ్బే లోకంగా బ్రతికే నాగార్జున... కుటుంబ విలువలు, ప్రేమ వంటివాటికి ప్రయారిటి ఇవ్వాలని ఎలా తెలుసుకున్నాడు వంటి విషయాలతో సినిమా నడుస్తుందని టాక్.

  చిత్రంలో ఉండే ఆరు పాటల్లో అయిదు పాటల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన ఒక్క పాటను నాగ్, నాయనతారపై త్వరలోనే చిత్రీకరించనున్నారు.

  హైదరాబాద్, యూరప్, అమెరికా, బ్యాంకాక్ లాంటి అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది.

  ఈ సినిమాకు మొదటి ‘లవ్‌స్టోరీ' అనే టైటిల్‌ని నిర్ణయించినట్లుగా గతంలో వార్తలొచ్చాయి. తర్వాతేమో... ‘సరిలేరు నీకెవ్వరూ' అని ప్రచారం జరుగింది. అయితే ఈ రెండు టైటిల్సూ కాదని, గ్రీకు వీరుడు అనే టైటిల్ ని ప్రకటించారు.

  దశరథ్, నాగార్జున కాంబినేషన్‌లో పదకొండేళ్లక్రితం వచ్చిన ‘సంతోషం' చిత్రం మించి ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

  నాగార్జున సొంతబ్యానర్ లాంటి కామాక్షిపై ఈ చిత్రాన్ని డి.శివప్రసాద్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

  చాలాకాలం తర్వాత నాగ్ ప్రేమకథలో నటించటం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.

  ఎంతగానో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్న ఢమురకం అనుకున్న రీతిలో మ్రోగకపోవటంతో ఈ చిత్రంపైనే నాగ్ ఆశలు పెట్టుకున్నారు.

  ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

  English summary
  Nagarjuna's Greeku Veerudu Working stills released. Dasarath directs this and Nayantara in female lead. This movie is produced by Chandan Reddy under Kamakshi movie banner and Music by Devi Sri Prasad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X