twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ పాట వింటే రోజంతా ఉత్సాహమే:నాగార్జున

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి, ఆరోజంతా ఉల్లాసంగా ఉండటానికి శిరిడీ సాయి చిత్రంలోని 'అమరరామ....' పాట వింటే చాలు. శిరిడి సాయి పాటలకు లభిస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఉన్న ఇతర పాటలు కూడా చాలా బాగుంటాయి. మంచి పాటలిచ్చినందుకు కీరవాణికి ధన్యవాదాలు'' అన్నారు నాగార్జున. అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల్లో భక్తునిగా నటించిన నాగార్జున 'శిరిడి సాయి'లో భగవంతుడిగా కనిపించబోతున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి సులోచనారెడ్డి సమర్పణలో ఎ.మహేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

    అలాగే ఈ చిత్రంలో నటించడం మొదలుపెట్టిన తర్వాత సాయిబాబా జీవితం గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని నాగ్ అన్నారు. శ్రీకాంత్, శ్రీహరి, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు చేశారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున తాజాగా 'శిరిడి సాయి'అనే భక్తి రస చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున కీ రోల్ చేస్తున్నఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులుమనాలిలో చిత్రీకరణ సాగుతోంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం లో నాగార్జునపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు.

    ఈ చిత్రం విషేషాలు నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ''బాబా జీవిత ఘట్టాల్నే కాదు.. ఆయన మహిమల్ని కూడా తెరపై ఆవిష్కరించే చిత్రమిది. నిత్యం సాయి దివ్యనామాన్ని జపించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారితో బాబాకి ఉన్న అనుబంధాన్ని కూడా ఇందులో చూడొచ్చు. బాబా జీవితం సాత్వికమైనది. ఆ పాత్రలో నాగార్జున ఇమిడిపోయిన విధానం అందరినీ మెప్పిస్తుంది. సాయిబాబా పాత్రకోసం నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నటిస్తున్నారు''అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సమర్పణ: సులోచనారెడ్డి, ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్‌, సంగీతం: కీరవాణి.

    English summary
    Nagarjuna happy with his upcoming devotional venture 'Shirdi Sai' audio. He says in this film Nagarjuna acted as Sai Baba.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X