»   » సమంతను అలా చూడలేకపోయాను. చాలా ఇబ్బందిగా ఉంది.. నాగార్జున

సమంతను అలా చూడలేకపోయాను. చాలా ఇబ్బందిగా ఉంది.. నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu
సమంతను అలా చూడలేకపోయాను - నాగార్జున

నాగచైతన్యతో వివాహం తర్వాత విడుదల అవుతున్న సమంత చిత్రం రాజుగారి గది2. ఈ చిత్రం అక్టోబర్ 13న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. రాజుగారి గది1 చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్నది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తొలిసారి ఓ హారర్, సస్సెన్స్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

 లాయర్‌గా సమంత

లాయర్‌గా సమంత

ఈ చిత్రంలో సమంత ఆత్మ పాత్రను పోషిస్తున్నారు. అయితే ఆత్మగా మారడానికి ముందు సమంత ఓ లాయర్. అయితే లాయర్‌ వృత్తిని నిర్వహించే సమంత పాత్ర ఎందుకు చనిపోయింది అనేది ఈ చిత్రంలో కీలక అంశం. ఈ చిత్రంలో సమంత పాత్ర ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసే విధంగా ఉంటుంది అని ప్రచారం జరుగుతున్నది. ఆ చిత్రంలో లాయర్ పాత్రకు సంబంధించిన సమంత ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

 చిన్మయి కంటతడి

చిన్మయి కంటతడి

రాజుగారి గది2 చిత్రంలో సమంత పాత్రకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి ఓ దశలో కంటతడి పెట్టుకొన్నదట. సమంత పాత్ర నన్ను హృదయాన్ని తాకింది అని చిన్మయి ఇటీవల ట్వీట్ చేశారు. అంతేకాకుండా సమంత ఆత్మతో చేసిన సీన్లు ఆకట్టుకునే విధంగా ఉంటాయని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు.


 సమంతను అలా చూడలేకపోయాను

సమంతను అలా చూడలేకపోయాను

దెయ్యం పాత్రలో నటించిన సమంతను అలా చూడలేకపోయాను. తెర మీద సమంతను చూడటం చాలా ఇబ్బందిగా అనిపించింది. చైతూ అసలు రాజుగారి గది చిత్రాన్ని చూడను అని తనతో చెప్పాడు అని నాగార్జున వెల్లడించారు.


 మెంటలిస్టుగా నాగార్జున

మెంటలిస్టుగా నాగార్జున

రాజుగారి గది2 చిత్రంలో నాగార్జున మెంటలిస్టుగా నటిస్తున్నారు. ఎదుటి వ్యక్తుల్లో ఉండే విషయాలను పసిగట్టే పాత్రను నాగ్ పోషించారు. ఈ పాత్ర కోసం నాగార్జున పలువురు మెంటలిస్టులను, కొన్ని పరిశోధనలను కూడా చేశారు.


అతిథి పాత్రలో కాజల్

అతిథి పాత్రలో కాజల్

రాజుగారి గది2 చిత్రం మలయాళంలో వచ్చిన చిత్రానికి ఆధారం. ఈ చిత్రంలో నాగార్జున, సమంతతోపాటు వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, అశ్విన్ బాబు నటించారు. అయితే కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలో నటించిందనే ప్రచారం జరుగుతున్నది.English summary
Reports suggest that, Samantha Akkineni plays a lawyer in the Raju Gari Gadhi 2. A picture of Samantha from the sets has gone viral online. On the other hand, Nagarjuna plays a mentalist in the film.This film is slated on October 13th. Raju Gari Gadhi 2 also stars Vennela Kishore, Seerat Kapoor and Ashwin Babu in important roles. Kajal Aggarwal is rumoured to be playing a cameo.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu