»   » బిఎ జయ దర్శకత్వంలో నాగార్జున

బిఎ జయ దర్శకత్వంలో నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చంటిగాడు, లవ్లీ చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు బిఎ జయ త్వరలో నాగార్జునతో సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. నాగార్జున తనతో చేయడానికి ఓకే చెప్పారని, ఇప్పటి వరకు ఎప్పుడూ నాగార్జునను చూడని పాత్రలో ఆయన్ను చూపించబోతున్నామని, ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్టు డెవలపింగ్ దశలో ఉందని తెలిపారు.

ప్రస్తుతం జయ ‘వైశాఖం' పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆమె భర్త, ప్రముఖ పిఆర్ఓ బిఎ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అందరూ కొత్త నటీనుటలతో ప్లాన్ చేస్తున్నారు. అచ్చమైన తెలుగు వాతావరణంతో కూడిన చిత్రంగా వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా ప్రారంభం కాబోతోంది.

Nagarjuna in BA Jaya’s direction

ఈ సినిమా గురించి నిర్మాత బిఎ రాజు మాట్లాడుతూ.... లవ్‌ లీ తర్వాత వస్తున్న మంచి ఫిల్ గుడ్‌ సినిమా, అందరిని ఆకట్టుకునేలా సినిమా ఉంటుందన్నారు. ఇంతకాలం మా ఆర్‌జె బ్యానర్‌లో వచ్చిన సినిమాలను ఆదరించిన ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తాన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

English summary
BA Jaya of ‘Chantigadu’ and ‘Lovely’ fame is going to direct Nagarjuna soon. This dynamic lady director announced it officially. She said that though Nag gave his nod to work with her, she wanted to show the ‘King’ in a never seen before role and so has been taking time to develop the script.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu