For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'బేబీ డెలివరీ', అది బిగ్ సర్‌ప్రైజ్!, ఇక నావల్ల కాదని.. కొత్త విషయం చెప్పిన నాగ్

  |

  హీరోలుగా కెరీర్ చరమాంకంలో ఉన్న స్టార్స్ అంతా.. తమ వారసుల్ని ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసేందుకు చాలానే కష్టపడుతున్నారు. ఇందులో ముందు వరుసలో ఉంటారు టాలీవుడ్ కింగ్ నాగార్జున.

  'హలో' స్టోరీ బయట పెట్టిన నాగ్ ! | Filmibeat Telugu

  అఖిల్ నటిస్తున్న రెండో చిత్రం 'హలో' విజయం కోసం ఆయన చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. 'అఖిల్' ఫెయిల్యూర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో.. ఈసారి ఎలాగైనా కొడుకు సక్సెస్ చూడాలని ఆరాటపడుతున్నారు.

  ఈ నేపథ్యంలోనే 'హలో' సినిమాకు మంచి ప్రమోషన్ తీసుకొచ్చేందుకు నాగార్జున స్వయంగా రంగంలోకి దిగారు. ప్రీ-రిలీజ్ వేడుకకు చిరంజీవిని తీసుకొచ్చి ఎటెన్షన్ క్రియేట్ చేసిన నాగ్.. గురువారం మీడియాతో చిట్ చాట్ లో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే మీకోసం..

   'బేబీ డెలివరీ'

  'బేబీ డెలివరీ'

  బేబీ మా చేతుల్లో నుంచి డెలివరీ అయిపోయింది. ఇక మా చేతులలో లేదు. మేం చేయాల్సినవన్నీ చేసేశాం. తీర్పు కోసం మీ ముందుకు వచ్చేసింది. మంచి అందమైన బేబీని తయారు చేశామని అనుకుంటున్నాం. రేపు చూసి.. మీరు కూడా అలాగే ఫీలవుతారని మా ఆశ.

   నాగ్ మనం హిట్ కొట్టాలి:

  నాగ్ మనం హిట్ కొట్టాలి:

  నాగ్ రేపు ఎలాగైనా మనం హిట్ కొట్టాలని అప్పుడే ఫోన్లు, మెసేజ్‌లు వచ్చేస్తున్నాయి. 'మనం' సినిమా పూర్తయిన వెంటనే మళ్లీ అన్నపూర్ణలో సినిమా చేయాలని విక్రమ్‌ని అడిగాను.

  కానీ అప్పటికే సూర్యతో '24' సినిమాకి కమిట్ అయ్యానని చెప్పారు. అది పూర్తవగానే అఖిల్‌తో సినిమా చేద్దామని విక్రమ్ అన్నారు. అన్నట్లుగానే ఈ సినిమా చేశారు.

   అఖిల్ పాట:

  అఖిల్ పాట:

  అఖిల్ పాట పాడటం పెద్ద సర్‌ప్రైజ్. చిన్నప్పటి నుంచి అఖిల్‌ని చూస్తున్నాం. కనీసం ఇంట్లో ఎన్నడూ విజిల్ కూడా వేయడు. అలాంటిది ఒక రోజు వచ్చి.. 'హలో' కోసం ఓ పాట తయారైంది నాన్న విను అన్నాడు. ఇది నీ గొంతు లాగే ఉంది కదా అనేసరికి.. నవ్వేశాడు. నాకు అది నిజంగా పెద్దగా సర్‌ప్రైజ్.

   అనూప్ సర్‌ప్రైజ్:

  అనూప్ సర్‌ప్రైజ్:

  'హలో' సినిమాలో అఖిల్ పాట పాడినట్లు తెలియగానే వెంటనే అనూప్‌కి ఫోన్ చేసి మూడు నెలల నుంచి మీరు చేస్తుంది ఇదా.. అని అడిగాను. ఒక్కసారి కూడా చెప్పలేదు అని అడిగితే.. మిమ్మల్ని, అమలను సర్‌ప్రైజ్ చేయాలనే చెప్పలేదు సార్ అన్నాడు. నేనైతే చాలా థ్రిల్‌ అయ్యాను.

  'మనం చరణ్ తోనే ఆపేశాం.. వాడికి తమ్ముడు ఉండుంటే; అఖిల్ రెండో కొడుకే!': సురేఖతో చిరు

   నావల్ల కాదండి:

  నావల్ల కాదండి:

  హలో తర్వాత అఖిల్ చేయబోయే సినిమా గురించి ఇంకా ఏమి అనుకోలేదు. నా ప్రొడక్షన్, నా సినిమాలు తప్పిదే వేరేది ఏదీ చూడను. చెప్పినా కూడా నమ్మరు ఎవరు. నేను ప్రొడ్యూస్ చేస్తే వెనుకాల ఉంటా. నేను నటిస్తే వెనుకాల ఉంటా. చైతూ, అఖిల్ నటించే సినిమాల గురించి పట్టించుకోవడం ఇక నా వల్ల కాదండి. నా దగ్గర ఇంక ఓపిక లేదు. నాకు చాలా పనులున్నాయి అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు నాగ్.

   మదర్ ఏంటి నాగ్?:

  మదర్ ఏంటి నాగ్?:

  హలో సినిమాలో తల్లి పాత్ర కోసం తానే స్వయంగా రమ్యకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిపారు. మదర్ క్యారెక్టర్ అని చెప్పగానే.. 'మదర్ ఏంటి నాగ్?' అని రమ్యకృష్ణ అన్నారని, కానీ ఈ పాత్రకు థియేటర్ లో క్లాప్స్ పడుతాయని చెప్పగానే ఒప్పుకున్నారని నాగ్ చెప్పారు. ఈ పాత్ర గురించి అడిగినప్పుడు.. రమ్యకృష్ణ అప్పుడే బాహుబలి షూటింగ్ పూర్తి చేసుకున్నారని గుర్తుచేశారు.

  నాగార్జున నాకు పెద్ద పరీక్షే పెట్టాడు?.. ఆ ప్రశ్నలు వెంటాడుతాయి, కానీ!: 'హలో'పై చిరంజీవి..

   కొత్త విషయం చెప్పిన నాగ్:

  కొత్త విషయం చెప్పిన నాగ్:

  ఇక 2018 సెకండాఫ్‌లో చైతూతోను విక్రమ్ కె కుమార్ సినిమా ఉంటుందని చెప్పారు నాగ్. తనతో తీశావు. అఖిల్‌తో తీశావు. చైతూతో కూడా సినిమా తీయాలని విక్రమ్ ను కోరినట్లు చెప్పారు. 'మనం'లో చైతూది చిన్న పాత్ర అని గుర్తుచేశారు.

  తన కోరిక మేరకు విక్రమ్ చైతూతోనూ సినిమా చేస్తానని మాటిచ్చినట్లు తెలిపారు. అయితే దాని కన్నా ముందు బయటి ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తానని అన్నట్లు చెప్పారు. అది ఇద్దరికీ మంచిదని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

  English summary
  In an interview with media actor Nagarjuna bares his heart on all things about his son Hello movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X