»   » ఏర్పాట్లన్నీ "అంతకు మించి" అనేటట్టే.... అఖిల్ నిశ్చితార్థానికి కేసీఆర్ని ఆహ్వానిచిన నాగార్జున

ఏర్పాట్లన్నీ "అంతకు మించి" అనేటట్టే.... అఖిల్ నిశ్చితార్థానికి కేసీఆర్ని ఆహ్వానిచిన నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని వార‌సుడు అఖిల్ నిశ్చితార్థం కోసం తెలంగాణా సీఎం కేసీఆర్ ను నాగార్జున స్వ‌యంగా ఆహ్వానించారు. కేసీఆర్‌ను హీరో నాగార్జున కలిశారు. తన కుమారుడు అఖిల్ నిశ్చితార్థానికి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. అఖిల్ కి, జీవీకే మ‌న‌వరాలికి వ‌చ్చే నెల‌లో నిశ్చితార్థం నిర్వ‌హించ‌బోతున్నారు. అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ నిశ్చితార్థం డిసెంబర్ 9న శ్రేయా భూపాల్‌ తో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రేయా, అఖిల్‌లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్ళికి అంగీకరించడంతో జీవీకే హౌస్‌లో అఖిల్, శ్రేయాల నిశ్చితార్థం జరగనుంది . ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఆహ్వానించారు నాగార్జున. సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లి భేటి అయిన నాగ్, తప్పకుండా తన కుమారుడి నిశ్చితార్ధ వేడుకకి రావాలని కోరారట.

 డిసెంబరు 9 రాత్రి 7 గంటలకు:

డిసెంబరు 9 రాత్రి 7 గంటలకు:


అక్కినేని అఖిల్‌ నిశ్చితార్థం తేది ఖరారైంది. శ్రేయా భూపాల్‌తో డిసెంబర్‌ 9న నిశ్చితార్థం జరగనుంది. అఖిల్‌, శ్రేయా గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఇరువురి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. నిశ్చితార్థం వేడుకకి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. డిసెంబరు 9 రాత్రి 7 గంటలకు జీవీకే హౌస్‌లో అఖిల్‌, శ్రేయా నిశ్చితార్థం వేడుక వైభవంగా జరగనుంది.

 హల్ చల్ చేస్తున్నాడు:

హల్ చల్ చేస్తున్నాడు:


సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని తెలుస్తోంది.అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నటవారసుడు అఖిల్, తన రెండో సినిమాతో పాటు పెళ్లి వార్తలతోనూ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌తేడాది దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అఖిల్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అయ్యింది.

 రెడీ అవుతున్నాడు:

రెడీ అవుతున్నాడు:


అఖిల్ త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు మ‌నం - 24 సినిమాలతో సౌత్ ఇండియాలో డిఫ‌రెంట్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అదే సమయంలో తన పెళ్లి వేడుకకు కూడా ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాడట.తన ఫ్యామిలీ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రేయా భూపాల్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న అఖిల్ త్వరలోనే ఆమె మెడలో మూడు ముళ్లు వేయడానికి రెడీ అవుతున్నాడు.

 డెస్టినేషన్ వెడ్డింగ్ :

డెస్టినేషన్ వెడ్డింగ్ :


నాగచైతన్య, సమంతల వివాహం కన్నా ముందే.. అఖిల్ పెళ్లి జరుగనుందని తెలుస్తోంది. అఖిల్ తన రెండో సినిమా పూర్తి చేసిన వెంటనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఇటలీలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అఖిల్, శ్రేయా వివాహవేదికపై అధికారిక ప్రకటన రానుందన్న టాక్ వినిపిస్తోంది.

 అఖిల్ ఎంగేజ్ మెంట్:

అఖిల్ ఎంగేజ్ మెంట్:


కొన్నాళ్ళుగా అక్కినేని ఫ్యామిలీలో జరగనున్న శుభకార్యం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అఖిల్ ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయిందనేది 100% గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా చైతూ-సమంత ప్రేమాయణంతో పాటు అఖిల్- శ్రేయ భూపాల్ ప్రేమ వివాహంకు సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. దీనిపై పూర్తి క్లారిటీ లేక అభిమానులు తర్జన భర్జన పడ్డారు. ఇక అఫీషియల్ గా అఖిల్ ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ చేసి ఇన్విటేషన్ కార్డ్ ని రిలీజ్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

 సీఎం కేసీఆర్ :

సీఎం కేసీఆర్ :


అఖిల్ నిశ్చితార్థం డిసెంబర్ 9న శ్రేయా భూపాల్‌ తో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఆహ్వానించారు నాగార్జున. సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లి భేటి అయిన నాగ్, తప్పకుండా తన కుమారుడి నిశ్చితార్ధ వేడుకకి రావాలని కోరారట. ఇక పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను కూడా నాగ్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.

 పెళ్లి ఇటలీలో:

పెళ్లి ఇటలీలో:


పెళ్లి ఇటలీలో ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న సమయంలో నిశ్చితార్థం ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి కుమార్తె వారే పూర్తిగా ఈ ఏర్పాట్లు చేస్తన్నట్లు తెలుస్తోంది. నాగార్జున కేవలం అతిధులను ఆహ్వానించడంలో నిమగ్నం అయ్యారు.ఇక్కడే చేసి అందరిముందు బాగుంటుందని నాగార్జున ఫ్యామిలీ భావిస్తుంటే, భూపాల్ ఫ్యామిలి మాత్రం వీరి పెళ్లిని ఇటలీలోని రోమ్ నగరంలో చేయాలని భావిస్తున్నారట. ఎంతో ఘనంగా నిర్వహించాలని ఇరుకుటుంబాలు భావిస్తున్నాయి. ఈ సమయంలో వీరి పెళ్లి ఎక్కడ జరుగుతుందని అందరు భావిస్తున్నారట.

 నాగచైతన్య, సమంత :

నాగచైతన్య, సమంత :


అదే సమయంలో నాగచైతన్య, సమంత పెళ్లి విషయంలో కూడా అక్కినేని ఫ్యామిలీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. వీరి వివాహాన్ని 2017 ఆగస్టులో నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో అనుకున్నట్టుగా హిందూ సాంప్రదాయ ప్రకారం, క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం రెండు వివాహాలు జరిపించేందుకు నిర్ణయించారు. అయితే ఒక్క రోజు తేడాతో ముందు హిందూ వివాహం తరువాతి రోజు క్రిస్టియన్ వివాహం ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ పెళ్లి విషయంలో అక్కినేని ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

English summary
Akkineni household is making all arrangements for Akhil Akkineni's engagement. He will get engaged to Shreya Bhupal on 9th December. Nagarjuna today met Telangana Chief Minister K Chandrasekhar Rao and invited him to grace the engagement ceremony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu