»   » నాగచైతన్య, అఖిల్ ప్రేమల గురించి నాగార్జున ఇలా...

నాగచైతన్య, అఖిల్ ప్రేమల గురించి నాగార్జున ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున ఇంట్లో ఒకేసారి రెండు వివాహాలు చోటు చేసుకునే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది. అటు పెద్ద కుమారుడు నాగ చైతన్య, ఇటు చిన్న కుమారుడు అఖిల్ ఇద్దరూ ప్రేమలో ఉండటంతో ఆయన హ్యాపీగానే కనపడుతున్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు.

నాగార్జున మాట్లాడుతూ..."అమల, నేను చైతు విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం, నాగచైతన్య సంతోషంగా ఎవరితో ఉండగడో వారిని ఎంచుకున్నందకు. త్వరలోనే ఎనౌన్సమెంట్ చేస్తాం. అఖిల్ కూడా ఓ అమ్మాయిని ఎంచుకున్నాడు. అయితే వారికి ఎంగేజ్మెంట్ జరిగింది అన్నది మాత్రం అబద్దం." అని చెప్పారు.

Also See: అఖిల్ అక్కినేని ప్రేమించిన అమ్మాయి ఈవిడేనా?, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? (ఫోటోస్)

నాగచైతన్య లవ్ స్టోరీ కన్నా ఇప్పుడు ఇప్పుడు అఖిల్ లవ్ స్టోరి అంతటా చర్చనీయాంశంగా మారింది. అఖిల్ స్వయంగా తనకో గర్ల్ ఫ్రెండ్ ఉందని,తన తల్లి తండ్రులు తన ప్రేమను ఓకే చేసారని అఫీషియల్ గా ప్రకటించాక అంతటా అసలు ఎవరీ లక్కీ గర్ల్ అనే చర్చ మొదలైంది.

Nagarjuna is one happy dad with his son's love story

మీడియా సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె హైదరాబాద్ లో సిటీలో ఓ పేరున్న ఇండస్ట్రిలియస్ట్ షాలిని భూపాల్ కుమార్తె. ఆమె పేరు శ్రియ భూపాలి. అఖల్, శ్రియ గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. వీళ్లు రెండు ఫ్యామిలీలకు ఈ విషయం తెలుసు. అయితే వివాహం, నిశ్చితార్దం వంటివి కొంతకాలం తర్వాతే అని తెలుస్తోంది.

ఇక శ్రియాభూపాల్ కుటుంబంతో నాగార్జున కు సన్నిహిత సంభంధాలే ఉన్నాయట. రీసెంట్ గా ఆయన ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, తాను ప్రేమలో పడిన విషయం గురించి చెప్పడమే అందుకు కారణం. అఖిల్ ఇష్టపడిన అమ్మాయి డిజైనర్ అనీ .. న్యూయార్క్ లో చదువుకుందని తెలుస్తోంది.

English summary
Nag says. “Amala and I are very happy for Chaitanya, who has found someone who makes him happy. We’ll be making the announcement soon. Akhil too is seeing a girl. But contrary to rumours, they are not engaged as yet.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu