»   » వెబ్ సైట్స్ ఇబ్బంది పెడుతున్నాయి...నాగార్జున

వెబ్ సైట్స్ ఇబ్బంది పెడుతున్నాయి...నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను కింగ్‌, కేడి చిత్రాలు చేస్తున్నప్పుడు ఆ చిత్రాల టైటిల్స్‌ అధికారికంగా ప్రకటించక ముందే వెబ్‌సైట్స్‌లో దర్శనమిచ్చాయి. దాంతో ఆ టైటిల్స్‌నే ఖరారు చేయాల్సి వచ్చిందని నాగార్జున అన్నారు. అలాగే అదే వెబ్‌సైట్లు ఆ తర్వాత నాగార్జున ఇంగ్లిష్ ‌లో టైటిల్స్‌ పెడుతున్నాడని రాశాయి. ఇలా తప్పుడు వార్తలు అందించి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ఆయన కోరారు. సూపర్‌ హిట్‌ పత్రిక ప్రారంభించిన కొత్త వెబ్‌సైట్‌ను ఆయన సోమవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ పత్రిక ఆరంభించిన వెబ్ ‌సైట్‌ విజయపథంలో సాగాలని కోరుకుంటున్నాని తెలిపారు. పరిశ్రమ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వెబ్‌ సైట్‌ ను చూసి మంచి రేటింగ్‌ ఇవ్వాలని దర్శకులు పూరి జగన్నాథ్‌ కోరారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X