»   » కేడి నాగార్జున పై అమల ఆంక్షలు పెట్టిందట!

కేడి నాగార్జున పై అమల ఆంక్షలు పెట్టిందట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జునను అమల వివాహమాడి ఇన్నేళ్లయ్యింది, ఎప్పుడూ అతనిపై ఎటువంటి షరత్తులు పెట్టడం కానీ, కెరీర్, సినిమా ఇలా మరే విషయంలోనూ అడ్డు చెప్పడం తెలియని క్యూట్ అమల మొట్టమొదటిసారిగా ఒక్క విషయంలో నాగార్జునకు షరత్తులు పెట్టిందని సమాచారం. జోష్ సినిమా తో వెండితెరకు పరిచయమైన నాగచైతన్య కంటే తన సోదరుడు రెండు మూడు అడుగులు ఎక్కువగా, మన్మథడు నాగార్జున కంటే రెండు మూడు అంగుళాలు తక్కువగా ఎదిగిపోయిన అఖిల్ అక్కినేనిని మరో రెండు మూడు సంవత్సరాల్లో హీరోగా వెండితెరకు పరిచయం చేసేందుకు ఇప్పట్నుంచి కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే.

సుమంత్ ను హీరోగా పరిచయం చేస్తూ నాగార్జున నిర్మించిన చిత్రం 'ప్రేమకథ" కు సంగీతాన్నందించిన సందీప్ చౌతా, నాగచైతన్య మొదటి చిత్రమైన 'జోష్" కూడా సంగీతాన్ని అందించి బోల్తా పడ్డ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని దష్టిలో పెట్టుకొన్న అమల తనయుడు 'అఖిల్" పరిచం కాబోయే చిత్రానికి సందీప్ చౌతాను మాత్రం సంగీత దర్శకుడిగా పెట్టకూడదని అమల 'ఆంక్షలు" విధించిందని బోగట్ట. ఇందుకు గాను కేడి నాగార్జున నుండి అమల స్ఫష్టమైన హామీ తీసుకుందని సినీ వర్గాల కథనం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu