»   » నాగార్జున మదర్ సెంటిమెంటుపై గుసగుసలు

నాగార్జున మదర్ సెంటిమెంటుపై గుసగుసలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ మన్మధుడిగా ఇమేజ్ సంపాదించుకున్న నాగార్జున రూటే సపరేటు. సినిమాల విషయంలోనూ, ఇతర వ్యవహారాల విషయాల్లోనూ ఆయన శైలి ఇతర హీరోలకు భిన్నంగా ఉంటుంది. ఇటు సినిమాల్లో రాణిస్తూనే అటు వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు నాగ్. ఈ విషయం పక్కన పెడితే నాగార్జున పర్సనల్ లైఫ్ కు గురించిన ఓ విషయం ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశమైంది.

నాగార్జునకు వాళ్ల అమ్మ అంటే మహా ఇష్టం. చిన్నప్పటి నుంచి తండ్రి అక్కినేని కంటే అమ్మతోనే ఆయనకు అనుబంధం ఎక్కువ. ఇప్పటికీ ఆయన ఈ సెంటిమెంటును కొనసాగిస్తున్నారు. వారానికి ఒకటి లేదా రెండు రోజులు ఆమెకు సేవ చేస్తూ గడుపుతాడట. వాళ్ల అమ్మను చూడకుండా ఆయన రోజు మొదలు పెట్టరంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. సన్నిహితులు చెప్పిన వివరాల ప్రకారం...నాగార్జున కుటుంబ విలువలను తప్పకుండా ఫాలో అవుతాడు. ముఖ్యంగా మదర్ సెంటిముంట్.

నాగార్జున ఈ స్థాయికి రావడానికి తండ్రి పేరు ప్రఖ్యాతలు ఎంతగా ఉపకరించాయో....చిన్ననాటి నుంచి తల్లి పెంపకం, ఆమె ప్రోత్సాహం వల్లనే ఆయన ఈ స్థాయికి ఎదిగారు. అందుకే ఆయకు అమ్మంటే ఎంతో ప్రేమ. నాగ్ ప్యామిలోని ప్యూచర్ జనరేషన్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు.

English summary
Nag has strong mommy sentiment. Weekly once or twice, Nag makes it a point and meets his mom. Without seeing her, he doesn’t go out to start his day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu