»   »  నాగ్ హీరోగా బోయపాటి సినిమా

నాగ్ హీరోగా బోయపాటి సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu


భద్ర, తులసి సినిమాలకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీనివాస్ త్వరలో మూడవ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నాడు. తన మూడవ చిత్రం హీరో నాగార్జున. శివప్రసాదరెడ్డి నిర్మాణ సంస్థ కామాక్షి మూవీస్ పతాకంపై సినిమా చేయడానికి ఇప్పటికే బోయపాటి శ్రీనివాస్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే శివప్రసాద రెడ్డి సినిమాలు చేస్తే నాగార్జునతోనే చేస్తాడు. శివప్రసాద రెడ్డి నాగార్జున ఫ్యాన్ కావడం విశేషం.

కామాక్షి మూవీస్ పతాకంపై సినిమా చేయడానికి నాగార్జున కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. బోయపాటి చెప్పిన కథ నాగార్జునకు నచ్చిందట. బోయపాటి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తరువాతే సెట్స్ మీదకు వెళ్లడం బోయపాటికి అలవాటు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X