»   » ఆమె కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నాగ్..

ఆమె కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నాగ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ట్విటర్‌ ద్వారా తమ అభిమానులను పలకరిస్తున్న హీరోల్లో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. అయితే ఇటీవల రెండు, మూడు రోజుల నుంచి నాగార్జున తన అభిమానులతో పాటు ఇతరులు అడిగిన కొన్ని ప్రసన్నలకు జవాబులు ఇవ్వడం లేదు. దీనికి కారణం నాగ్‌ కి వైరల్‌ ఫీవర్‌ అటాక్‌ అయినందువల్లే నాగ్‌ ట్వీట్‌ చేయలేకపోతున్నాడట. ఇక తనకు వచ్చిన వైరల్‌ గురించి తన అభిమానులకు వివరిస్తూ...

నాకు ఇప్పుడు బాగానే వుంది అంటూ...కామాక్షి కళా మూవీ పతాకంలో వీరు పోట్ల దర్శకత్వంలో తను హీరోగా రూపొందుతోన్న సినిమా కూడా సోమవారం (26.07.10)నుంచి ఆరంభం కానుందని తెలిపారు. ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్‌ గా నటిస్తోంది. అన్నట్లు ప్రియమణి గురించి నాగ్‌ తన ట్విటర్‌ లో ఇలా తెలిపారు...ఆమెతో కలిసి వర్క్‌ చేయడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అని వివరించారు. కాగా నాగ్ సరసన మరో కథానాయిక అనుష్క కూడా నటించనుందని సమాచారం. ఈ చిత్రం పక్కా మాస్ చిత్రంగా మొట్టమొదటి సారి రాయలసీమ స్లాంగ్ మాట్లాడబోతున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu