»   » అదేదో బూతులా ఉందే?.... అఖిల్, నాగ్, నాని కలిసి అతన్ని ఆడుకున్నారుగా!

అదేదో బూతులా ఉందే?.... అఖిల్, నాగ్, నాని కలిసి అతన్ని ఆడుకున్నారుగా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోన‌రుడా..! ఫ‌స్ట్ లుక్‌ను అక్కినేని నాగార్జున విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టర్ చూసి అఖిల్ చేసిన ట్వీట్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

పోస్టర్ నచ్చింది.... ఈయన సూపర్ మ్యానా? లేక సు**** మ్యానా? అంటూ అఖిల్ కామెంట్ చేసారు. అఖిల్ ఈ కామెంట్ సరదాగా చేసినా అందులో ఏదో బూతు అర్థం కనిపిస్తోందని ఫీలవుతున్నారు చాలా మంది.


కాగా..ఫ‌స్ట్‌లుక్‌లోని విల‌క్ష‌ణ‌త వ‌ల్ల ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.


ఈ సినిమాతో ప‌ల్ల‌వి సుభాష్ హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంది. త‌నికెళ్ళ‌భ‌ర‌ణి ఈ చిత్రంలో ప్ర‌ముఖ పాత్ర‌ను పోషిస్తున్నారు. గోల్కొండ హైస్కూల్‌, ఊహ‌లు గుస‌గుసలాడే చిత్రాల‌కు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన మ‌ల్లిక్‌రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.


సినిమా గురించి మరికొన్ని

సినిమా గురించి మరికొన్ని

క్ష‌ణం వంటి సూప‌ర్‌హిట్ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందించిన ష‌నీల్ డియో ఈ సినిమా సినిమాటోగ్ర‌ఫీని అందిస్తుండ‌గా, క్ష‌ణం, గుంటూర్ టాకీస్ వంటి చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. కిట్టు విస్సాప్ర‌గ‌డ, సాగ‌ర్ రాచ‌కొండ‌ మాట‌లు అందిస్తున్నారు. వై.సుప్రియ‌, జాన్ సుధీర్ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ శేషు, సుంక‌ర‌ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు.


నాగ్ ట్వీట్

నరుడా..డోనరుడా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి సుమంత్ ఏం డొనేట్ చేస్తాడో?....స్మైల్ ఎక్స్ ప్రెషన్స్ కలిపి ట్వీట్ చేసాడు.


అఖిల్ ట్వీట్ లో బూతు

సుమంత్... సుపర్ మ్యానా? లేక సు*** మ్యానా? అంటూ అఖిల్ ట్వీట్ చేసాడు. అఖిల్ సరదాగా చేసిన ఈ ట్వీట్ వెనక ఏదో డబల్ మీనింగ్ బూతు ఉందని అంటున్నారంతా.


సుమంత్ అన్నా అంటూ రానా

సుమంత్ అన్నా... సూపర్ గా ఉంది అంటూ రానా ట్వీట్ చేసాడు.


ఇపుడు నువ్వే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్

ఫస్ట్ లుక్ సూపర్ కూల్ గా ఉంది. నువ్వే ఇపుడు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అంటూ నాని సరదాగా ట్వీట్ చేసాడు.


పోస్టర్ డిజైన్ కేక

పోస్టర్ డిజైన్ కేక

ఈ పోస్టర్ డిజైన్ చూసారుగా..... ఈ సినిమాలో సుమంత్ వీర్యదాతగా కనిపిస్తున్నాడు. ఆ విషయాన్ని కళ్లకుగట్టినట్లు ఈ పోస్టర్లో చూపించారు.


English summary
"Loving this ! Superman or S****Man!Kickass first look with a kick ass title. Way to go bro can't wait to c the kids" Akhil tweet about Naruda DONORuda.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu