»   » నాగార్జున కొత్త టైటిల్ 'వాంటెడ్'

నాగార్జున కొత్త టైటిల్ 'వాంటెడ్'

Posted By:
Subscribe to Filmibeat Telugu

వాంటెడ్ అనే టైటిల్ ను నాగార్జున కొత్త చిత్రానికి పరిశీలిస్తున్నారు. ఆకాశమంత చిత్రం దర్శకుడు రాధామోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజు ప్రత్యేకమైన పాత్ర చేయనున్నారు. అలాగే ఇంతకు ముందు పయినం అనే టైటిల్ తో కాందహార్ హైజాక్ బ్యాక్ డ్రాప్ తో చిత్రం అని ప్రకటించారు. ఈ రెండు ఒకటేనా కాదా అన్నది తేలాల్సి ఉంది. ఇక హైజాక్ స్క్రిప్టు మాత్రం పూర్తిగా ఓ ప్లైట్ హైజాక్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. కాందహార్ లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథ తయారు చేసాడని అంటున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్న ప్రకాష్ రాజ్ తమిళ మీడియాతో చెప్పుకొచ్చారు.

అప్పట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...కెప్టెన్ దేవి శరన్ రాసిన ఫ్లైట్ ఇంటూ ఫియర్ అనే పుస్తకం ఆధారంగా ఈ కథ తయారుచేయబడింది. ఈ పుస్తకం 1998లో టెర్రరిస్టులు కాందహార్ ప్లేన్ ని హైజాక్ చేయటం..తదితర పరిణామాలు ఆధారంగా రాసారు...ఈ పుస్తకం చదవగానే నాకు దీన్ని సినిమా చేయాలని పించింది. ఇందులో నేను ప్రధాన మంత్రి ఆఫీసులో పనిచేసే ఓ గవర్నమెంట్ ఉద్యోగిగా కనిపిస్తాను. టెర్రరిస్టులు గవర్నమెంట్ ను బెదిరించటం నుంచి తిరుపతిలో ల్యాండ్ అవటం దాకా వివరంగా చూపుతాం. అలాగే ఇందులో ఉండే ప్యాసింజర్స్, వారి మధ్య జరిగే రకరకాల ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది అన్నారు. ఇక ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నాగార్జున కనిపిస్తారు. దిల్ రాజు దీనిని హై బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ దీనిని కన్నడ, తమిళ భాషల్లో దీనిని రీమేక్ చేస్తున్నారు. మరి ఈ వాంటెడ్, పయినం ఒకటేనా కాదా అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం నాగార్జున, మమతా మోహన్ దాస్ కాంబినేషన్ లో కేడీ అనే చిత్రం విడుదలకు రెడీగా ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu