»   » రామ్ చరణ్ తో చేసే విషయమై నాగ్ క్లారిఫికేషన్

రామ్ చరణ్ తో చేసే విషయమై నాగ్ క్లారిఫికేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా రూపొందనున్న తమిళ చిత్రం తని ఒరువన్ రీమేక్ లో నెగిటివ్ పాత్ర చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో ఆ పాత్రను అరవింద్ స్వామి చేసారు. ఆయనకు ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఆ పాత్ర కోసం నాగార్జనను అడిగినట్లు చెప్పకున్నారు. అయితే నాగార్జున తాను ఈ రీమేక్ చిత్రంలో ఎలాంటి పాత్రా చేయటం లేదని క్లారిఫై చేసారు.

ప్రస్తుతం నాగార్జున...

సోగ్గాడే చిన్ని నాయన చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున తాత, మనవడు పాత్రల్లో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు పాత్రలకు రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి (‘అందాల రాక్షసి' ఫేం) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాగార్జున సరసన అనసూయ మరదలి పాత్రలో నటిస్తోందని సమాచారం.

సోగ్గాడే చిన్ని నాయనా షూటింగ్ పూర్తయ్యే వరకు నాన్ స్టాప్ గా సాగుతుంది. లవ్లీ అనసూయ కూడా ఓ ఎంటర్టెనింగ్ సీన్ కోసం షూటింగులో జాయిన్ అయింది అని నాగార్జున తెలిపారు. సినిమాలో నాగార్జున, అనసూయల మధ్య బావా మరదళ్ల సరసాలు, రొమాంటిక్ సీన్లు ఉంటాయని టాక్. నాగార్జునతో కలిసి ఓ పాటలో ఆమె డాన్స్ కూడా చేస్తుందట. హాట్ అండ్ సెక్సీ లేడీ, ఐటం గర్ల్ హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు.

Nagarjuna not doing tamil remake

మరో చిత్రం ఊపిరి విషయానికి వస్తే...
అక్కినేని నాగార్జున, తమిళ నటుడు కార్తీ హీరోలుగా, అందాల భామ తమన్నా హీరోయిన్‌గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి సినిమా పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘ఊపిరి'.

స్నేహం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. ఈ చిత్ర వివరాలను గురించి నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి తెలియజేస్తూ, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రమని, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నారు.

English summary
Nagarjuna clarifies that he's not doing any role in the Telugu remake of #ThaniOruvan.
Please Wait while comments are loading...