twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొగడ్తల కోసమే ఆడియో ఫంక్షన్స్: నాగార్జున

    By Srikanya
    |

    మ్యూజిక్ బాగుంటే హంగామా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జనాలు వారంతట వారే పాటలను కొని వింటారు. అది ఆటోమెటిక్ గా జరిగిపోతుంది అన్నారు నాగార్జున. ఆయన తాజా చిత్రం రాజన్న చిత్రం కు ఆడియో ఫంక్షన్ చేయలేదు. ఈ విషయాన్ని ఆయన్ని ఎందుకు చేయలేదంటూ ఓ ఇంగ్లీష్ డైలి వారు అడిగితే ఇలా సమాధానమిచ్చారు. అలాగే చాలా ఆడియో ఫంక్షన్స్ ఒకరినొకరు ఎడ్మైర్ చేసుకోవటానికి ప్లాట్ ఫారంగా మారుతున్నాయి. నటీనటులు,యూనిట్ వాళ్లు అంతా ఒకరినొకరు పొగుడుకుంటూంటారు. అలాంటివి అస్సలు నేను ఇష్టపడను. నేను ఎప్పుడు నా సినిమా సంగీతం బాగుంటే దానంతట అదే ప్రజల్లోకి వెళ్ళుతుందని నమ్ముతాను అన్నారు.

    ఇక తమ రాజన్న చిత్రం ప్రీమియర్ టిక్కెట్లు అమ్మటం పై మాట్లాడుతూ..రాజన్న చిత్రం ప్రీమియర్ షో టిక్కెట్లు అన్నీ అమ్ముడైపోయాయి. అయితే ఆ టిక్కెట్ల మీద వచ్చే డబ్బుని కేవలం నా ఏక్టింగ్ స్కూల్ కి ఫండింగ్ కోసమే వాడుతున్నాను. ఆ స్కూల్ ఓ నాన్ ప్రాఫెట్ ఆర్గనైజేషన్ అన్నారు నాగార్జున. ఇక రాజన్న చిత్రం నిన్న గురువారం నాడు అంతటా విడుదై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఓ యాక్షన్ తో కూడిన పీరియడ్ డ్రామా.

    English summary
    "Most audio functions are just platforms for mutual-admiration, where the cast and crew go gaga over one another praising each other in glowing terms. I personally don't like it. I feel my film's music is good and it will make it on its own steam," says Nag.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X