twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్ లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెడతాను: హీరో నాగార్జున

    By Srikanya
    |

    స్టార్ హీరో నాగార్జున త్వరలో హైదరాబాద్ లో ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్ధాపించే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లో... చిత్ర పరిశ్రమకు అవసరమైన సాంకేతిక నిపుణుల్ని అందించేందుకు, ఔత్సాహిక నటులను తీర్చిదిద్దేందుకు మన దగ్గర సరైన శిక్షణ సంస్థల్లేవు.ముంబయిలో ఉన్నట్లుగా దక్షిణాదిన సరైన శిక్షణ సంస్థల్లేవు. ఉన్నా అవి సినిమా రంగానికి అవసరమైన రీతిలో తీర్చిదిద్దేలా ఉండట్లేదు. దాంతో ఆసక్తి ఉన్న ఔత్సాహికులుకు సరైన మార్గ దర్శకత్వం లభించట్లేదు.

    ప్రస్తుతం ఈ రంగంలో అసెస్టింట్ లుగా చేరి పని చేస్తూనే నేర్చుకొంటున్నారు. ఇది సరైన విధానం కాదు. అందుకే నేను అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌, న్యూయార్క్‌ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా తరహాలో ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించాలనుకొంటున్నా అన్నారు. ఇక తెలుగులో ఇప్పటికే చిన్న చిన్న ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లు ప్రక్కన పెడితే రామానాయుడు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, రామోజీ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వంటివి అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్నాయి.

    English summary
    "Unfortunately, down south we don't have a film school like you have in Mumbai. So the gap has to be filled and I am 
 
 looking more at the quality aspect; hence this project has come up. After all these years in the industry, I have seen 
 
 there is no proper channel or guidance here if one wants to make a career in this line," Nagarjuna said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X