»   »  తాతా-మనవడు: నాగార్జున తంటా

తాతా-మనవడు: నాగార్జున తంటా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nagarjuna
సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు . ఆ బర్తడే వేడుకలకు నాగార్జున ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ రోజే నాగ్ తన కుమారుడు నాగ చైతన్య తెరంగ్రేటం కు శుభ ముహూర్తం నిర్ణయించాడు. దాంతో ఈ ఏర్పాట్లు అన్నీ తండ్రిని సంతోషపెట్టడానికా,తనయుడుని ఖుషీ చేయటానికా అన్నది తేలటం లేదని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అయితే తన తండ్రి గౌరవార్ధం కాకపోతే నాగచైతన్య లాంచింగ్ వేరే రోజు పెట్టుకునేవాడని ఆయన వర్గీయులు చెప్పుతున్నారు.ఇక ఇద్దరి కోసం ఈ పంక్షన్ గ్రాండ్ గా చేస్తున్నానని నాగార్జున సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. ఇక అక్కినేని ఈ పుట్టినరోజుకి 85 వ సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. అలాగే నాగచైతన్య సినిమాని నూతన దర్శకుడు వాసు వర్మ డైరక్ట్ చేయనున్నారు. దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సందీప్ చౌతా సంగీతాన్ని సమకూర్చనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X