»   » కెసిఆర్ తో ఒప్పందం కుదుర్చుకున్న నాగార్జున...?

కెసిఆర్ తో ఒప్పందం కుదుర్చుకున్న నాగార్జున...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ ఎండకా గొడుగు పట్టాలనే ఫిలాసఫీని తు.చ తప్పకుండా పాటించే ఆంధ్రడు ఎవరైనా ఉన్నారా అంటే నాగార్జున పేరుని తప్పక చెప్పి తీరాలి. ఎప్పటికప్పుడు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి జై కొట్టి తన పనులు కానిచ్చేసుకునే నాగార్జున గత ఎన్నికల్లో వైయస్ కి బాగా ఊది కాంగ్రెస్ ని ఆకాశానికెత్తిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో మున్ముందు హైదరాబాద్ కెసిఆర్ కనుసన్నల్లోకి వెళ్లిపోతుందని అనిపించడంతో అతడిని మెప్పించే పనిలో నాగ్ నిమగ్నమయ్యాడని భోగట్టా.

డిసెంబర్ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటే తన ఆస్తులకు నష్టం రాకుండా, తన సినిమాలకు కష్టం కలగకుండా కెసిఆర్ తో నాగార్జున కాళ్ల బేరానికి వెళ్లినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ ఏడెకరాల చుట్టూ వున్న ఇల్లీగల్ ల్యాండ్ లో నాగార్జున అక్రమ కట్టడానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా కెసిఆర్ నుంచి అభయం పొందాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత డిసెంబర్ లో తెలంగాణ రగడ చెలరేగినప్పుడు టీఆర్ ఎస్ నేతలు ముఖ్యంగా నాగార్జునని టార్గెట్ చేసి మాట్లాడడంతో ఈసారి మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా. తన జోలికి ఎవరూ రాకుండా కెసిార్ కి నాగ్ ముడుపులు చెల్లించుకున్నాడని అంటున్నారు. నాగార్జునతో పాటు హైదరాబాద్ లో భారీగా ఆస్తులున్న పలువురు సినీ ప్రముఖులు సైతం కెసిఆర్ ఫ్యామిలీతో రాయబేరాలు సాగిస్తున్నట్టు వినిపిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X