twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాటతో పోరాటం (రాజన్న ప్రివ్యూ)

    By Srikanya
    |

    విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా చేసిన చిత్రం రాజన్న. ఇది ఒక పీరియాడిక్ స్టోరీ. 1948 నాటి కథ ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా అదిలాబాద్‌ జిల్లా, నేలకొండపల్లి గ్రామం మాత్రం ఇంకా దొరల అధీనంలోనే ఉంటుంది. అక్కడ పీల్చే గాలికి కూడా పన్ను కట్టాల్సిందే. మల్లమ్మ (బేబీ అని)కి పాటంటే ఇష్టం. దొరసాని (శ్వేతామీనన్‌)కి మాత్రం పాటంటే ఓ చేదు జ్ఞాపకం... చెప్పలేని భయం. ఎందుకంటే రాజన్న (నాగార్జున) పాటతోనే ఆ వూరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు. అతను లేకపోయినా ఆ భయం మాత్రం దొరల్ని వెంటాడుతూనే ఉంది. అందుకే పాట పాడితే ప్రాణం తీస్తానని బెదిరిస్తుంది.

    సంగీతం మాస్టారు కులకర్ణి (నాజర్‌) చెప్పిన మాట విని మల్లమ్మ ఢిల్లీ బయలుదేరుతుంది. ఇంతకీ ఆ చిన్నారి ఢిల్లీ ఎందుకు వెళ్లింది? ఏం సాధించింది అన్నది తెర మీదే చూడాలి. చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ ''వాస్తవ సంఘటనల్ని ప్రేరణగా తీసుకొని అల్లుకొన్న కథ ఇది. స్వాతంత్య్రానంతరం నైజామ్‌లో ఉన్న పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపించాం. కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి బలం. యాక్షన్‌ ఘట్టాల్ని రాజమౌళి తెరకెక్కించిన విధానం ఆకట్టుకొంటుంది. బేబీ అని నటన అందర్నీ కదలిస్తుంద''న్నారు.

    సంస్థ: అన్నపూర్ణ స్డూడియోస్‌
    నటీనటులు: నాగార్జున, స్నేహ, బేబీ అని, శ్వేతా మీనన్‌, నాజర్‌, అజయ్‌, సుప్రీత్‌, ప్రదీప్‌ రావత్‌, ముఖేష్‌ రుషి, రవి కాలే, హేమ, శకుంతల తదితరులు.
    సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి
    నిర్మాత: అక్కినేని నాగార్జున
    దర్శకత్వం: విజయేంద్ర ప్రసాద్‌
    విడుదల: గురువారం

    English summary
    Akkineni Nagarjuna’s upcoming period drama ‘Rajanna’ movie is very good with high emotional quotient.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X