'రాజన్న'గా నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల
నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న 'రాజన్న'చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు.రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం చారిత్రక నేపధ్యంలో జరుగుతుంది. నాగార్జున సెకెండాఫ్ లో కనిపించే ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు. నాగార్జున కనపించే ఎపిసోడ్స్ మొత్తం విజయేంద్రప్రసాద్ కుమారుడు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరక్ట్ చేయనున్నారు. తెలంగాణ నేఫద్యంలో పీరియాడిక్ గా ఈ ఎపిసోడ్ ఉంటుందని యాక్షన్ ప్రధానంగా రూపొందుతుందని సమాచారం.రజాకార్ల ఉద్యమం నేపద్యంలో తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధుడి కధతో 'రాజన్న' తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.ఈ చిత్రం కథ జరిగే కాలం..1945-55. ఇక ఈ చిత్రంలో నాగార్జున పూర్తి తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూంటారు. అలాగే రాజమౌళి ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు.


Click it and Unblock the Notifications











