»   » మళ్శీ రికార్డులు బద్దలు అవ్వడం కోసం కలవనున్న క్రేజీ కాంబినేషన్..

మళ్శీ రికార్డులు బద్దలు అవ్వడం కోసం కలవనున్న క్రేజీ కాంబినేషన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కింగ్‌ నాగార్జున మరియు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు.. ఈ కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో ఓ స్పెషల్‌ క్రేజ్‌ వుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన 'ఆఖరి పోరాటం, జానకిరాముడు, అగ్నిపుత్రుడు, ఘరానాబుల్లోడు" చిత్రాలు హిట్‌ చిత్రాలుగా అందర్నీ అలరిస్తే.. ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'అన్నమయ్య, శ్రీరామదాసు" చిత్రాలు సంచలన విజయాలు సాధించి ఇటు నాగార్జున కెరీర్‌లోనూ, అటు రాఘవేంద్రరావు కెరీర్‌లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలుగా అఖండ ప్రజాదరణ పొందాయి.

మళ్ళీ ఈ కలయిక ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకాభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌. 'కింగ్‌" నాగార్జున కోసం దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు 'ఇంటింటా అన్నమయ్య" పేరుతో ఓ అద్భుతమైన సబ్జెక్ట్‌ రెడీ చేశారు. ఈ సబ్జెక్ట్‌ నాగార్జున విని 'చాలా బాగుంది" అన్నారు. ప్రస్తుతం 'రగడ, రాజన్న" చిత్రాలతో పాటు ఆర్‌ ఆర్‌ మూవీమేకర్స్‌ చిత్రాలు చేస్తున్న నాగార్జున ఈ చిత్రాల తర్వాత చేసే చిత్రం 'ఇంటింటా అన్నమయ్య" అవుతుందని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu