»   » అది పుకారు కాదు, నాగార్జున నిజంగానే ఆ కథ చేస్తున్నాడు... అయితే కథ మారింది

అది పుకారు కాదు, నాగార్జున నిజంగానే ఆ కథ చేస్తున్నాడు... అయితే కథ మారింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆట డ్యాన్స్ షోతో పాటు పాపులర్ టీవీ యాంకర్ గా పేరు తెచ్చుకుని సినిమా రంగంలో దర్శకుడిగా రాజుగారి గది వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను రూపొందించిన ఓంకార్, ప్రముక నిర్మాణ సంస్థ బ్యానర్ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కాంబినేషన్ లో రాజుగారి గది2 రూపొందుతోంది. 2015లో విడుదలైన రాజుగారి గది చిత్రం పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాకుండా హర్రర్ కామెడి జోనర్ లో ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఓంకార్ రాజుగారి గది చిత్రాన్ని వారాహి చలనచిత్రంతో సహకారంతో నిర్మించిన సంగతి తెలిసిందే.గత ఏడాది ఓంకార్ సినిమా రాజుగారి గది రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది ఆ చిత్రానికి సీక్వెల్ గా రాజుగారి గది 2 తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఓంకార్ ఆ పనుల్లో బిజీ గా ఉన్నాడు . అయితే అనుకోకుండా ఆ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది .

Nagarjuna

ఓంకార్ నాగార్జున కు కథ చెప్పడం నాగ్ కూడా ఈ సినిమా లో తన పాత్ర నచ్చి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . నాగార్జున తో ఊపిరి వంటి విభిన్న చిత్రాన్ని నిర్మించిన పివిపి రాజుగారి గది 2 చిత్రాన్ని నిర్మించనున్నాడు . టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ముందుంటాడు అన్న విషయం తెలిసిందే. కాగా రాజుగారి గది2 చిత్రానికి పివిపి సినిమా బ్యానర్ తోడు కావడంతో కాస్టింగ్ విషయంలో కానీ, టెక్నికల్ పరంగా కానీ సినిమా స్కేల్ పెరిగింది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారు.ఇందులో ఓ కీలకమైన పాత్రలో నాగార్జున కనిపిస్తారని సమాచారం. ఇది వరకు ఈ పాత్ర వెంకటేష్‌ చేస్తారని చెప్పు కొన్నారు. అది చివరికి నాగార్జున చేతికి చిక్కినట్టు తెలుస్తోంది. హారర్‌ చిత్రంలో నటించడం నాగ్‌కి ఇదే ప్రధమం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇదే విషయం లో మరికొన్ని కథలు వినిపిస్తున్నాయి ఈ సీక్వెల్ పై ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడీ సీక్వెల్ లో నాగార్జున నటిస్తారని ప్రచారం జగరడం హాట్ టాపిక్ అయ్యింది. ఇటివల విలక్షణమైన సినిమాలు చేస్తున్న నాగార్జున ఈ సీక్వెల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే దీనికి కధ మాత్రం వేరుగా వుంది. అన్నపూర్ణ కాంపౌండ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమాకి టైటిల్ రాజుగారి గది పార్ట్ 2నే. అయితే కధ మాత్రం ఓంకార్ ది కాదు. ఇటివల మలయాళంలో వచ్చిన ఓ హారర్ సినిమా హక్కులను కొనుగోలు చేశారట నాగార్జున. ఇప్పుడా రిమేక్ ను ఓంకార్ తో తెరకెక్కిస్తారట. దీనికి అల్రెడీ పాపులర్ అయిన రాజుగారి టైటిల్ ని తగిలిస్తారని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది.

English summary
the latest reports reveal that Omkar approached Nagarjuna for this film and Nagarjuna already gave his nod. Nagarjuna is known for choosing different subjects and always trying something new, his acceptance in this Horror comedy yet again proves him as a versatile star. The movie was said to go on sets from january onwards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu