twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా జర్నీలో ఎన్నో రిస్క్‌లు... ఇక్కడ స్టార్‌ హీరోలకే భరోసా లేదు: నాగార్జున

    By Bojja Kumar
    |

    Recommended Video

    Nagarjuna Interview About Officer Movie

    తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోల లిస్టులో సుధీర్ఘ కాలం తన ప్రయాణం కొనసాగించిన, ఇప్పటికీ కొనసాగిస్తున్న స్టార్ అక్కినేని నాగార్జున. ఆయన ఇన్ని రోజులు ఇండస్ట్రీలో హీరోగా ఇంకా స్టాండ్ అయి ఉండటానికి కారణం ట్రెండుకు తగిన విధంగా, తన వయసుకు సూటపయ్య పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగడమే. దీనికి తోడు వయసు పెరిగినా తరగని గ్లామర్ ఆయనకు ప్లస్ పాయింట్. జూన్ 1న 'ఆఫీసర్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మన్మధుడు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసూక్తికర విషయాలు వెల్లడించారు.

    అందుకే వర్మతో చేయడానికి ఒప్పుకున్నాను

    అందుకే వర్మతో చేయడానికి ఒప్పుకున్నాను

    వర్మ తీసుకొచ్చిన ఆఫీసర్ కథ నాకు చాలా బాగా నచ్చింది. హీరోయిజం ఉన్న సినిమా ఇది. శివాజీ రావు అనే పోలీస్‌ ఆఫీసర్‌ కథ ఇది. నిజాయతీ, ముక్కుసూటితనం, వ్యవస్థపై గౌరవం, ఏదైనా సరే తొణక్కుండా చేసే లక్షణం ఆ పాత్రలో కనిపిస్తాయి. దీనికి తోడు తండ్రీ కూతుర్ల ఎమోషన్‌ నన్ను కట్టిపడేసింది. నువ్వు పూర్తి ఫోకస్ సినిమాపైనే పెట్టాలని వర్మకు షరతు పెట్టాను. అతడు ఒకే చెప్పడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అని నాగార్జున తెలిపారు.

    నా జర్నీలో ఎన్నో రిస్క్‌లు

    నా జర్నీలో ఎన్నో రిస్క్‌లు

    వరుస ప్లాపులు తీస్తున్న రామ్ గోపాల్ వర్మతో చేయడానికి పెద్ద హీరోలు భయపడుతున్నారు. ఈ సినిమా ఒప్పుకోవడం మీకు రిస్క్ అనిపించలేదా? అనే ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ.... ‘నా కెరీర్లో చాలా రిస్క్‌లు ఫేస్ చేశాను. హిట్ తీసిన దర్శకుడితో సినిమా చేసినా ఆడని సందర్భాలు ఎన్నో. ‘చంద్రలేఖ' అందుకు చక్కటి ఉదాహరణ. ఓ సూపర్‌ హిట్‌ కథని రీమేక్‌గా తెచ్చుకున్నాం. ‘నిన్నే పెళ్లాడతా' తరవాత కృష్ణవంశీతో చేసిన సినిమా ఇది. మంచి టెక్నీషియన్లు పని చేశారు. అయినా సినిమా ఆడలేదు. అదే సమయంలో కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేసిన ‘సోగ్గాడే' బాగా ఆడింది... ఇలాంటివి నా కెరీర్లో ఎన్నో జరిగాయి' అన్నారు.

     టెన్షన్ పెట్టుకుంటే జుట్టు ఊడుతుంది

    టెన్షన్ పెట్టుకుంటే జుట్టు ఊడుతుంది

    టెన్షన్, రిస్క్ అనేది ప్రతి సినిమా విషయంలో ఉంటుంది. వాటిని వదిలించుకోకపోతే ఉనన జుట్టు ఊడుతుంది. అందుకే ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఇకపై నా సినీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ సరదాగా సాగించాలని అనుకుంటున్నాను అని నాగార్జున తెలిపారు.

    రజనీ చేయాల్సిన మూవీలో నేను చేయబోతున్నా

    రజనీ చేయాల్సిన మూవీలో నేను చేయబోతున్నా

    నా వద్దకు ఇప్పుడే ఎక్కువ శాతం వైవిధ్యభరితమైన కథలు వస్తున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ కథ విన్నాను. ఇద్దరు నేవీ కెప్టెన్ల కథ అది. అదే విధంగా ధనుష్‌ ఓ సినిమా చేయమని అడుగుతున్నాడు. రజనీకాంత్‌ కోసం రాసుకున్న కథ... ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో నాతో ఆ సినిమా చేద్దామనుకుంటున్నాడు, త్వరలోనే ఇది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అని నాగార్జున తెలిపారు.

    నాన్న జీవితం సినిమాగా వర్కౌట్ కాదు

    నాన్న జీవితం సినిమాగా వర్కౌట్ కాదు

    నాన్న జీవితం సినిమాగా తీస్తే వర్కౌట్ కాదేమో అని నా అభిప్రాయం. సినిమాలో కొంత నెగిటివిటీ ఉంటేనే జనాల్లో ఆసక్తి ఉంటుంది. నాన్న జీవితంలో అలాంటిదేమీ లేదు. ఆయన జీవితం సినిమా రూపంలో కంటే పుస్తక రూపంలోకి తెస్తే బెటర్ అని నా అభిప్రాయం అని నాగార్జున ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

    స్టార్ హీరోల సినిమాలకే భరోసా లేదు

    స్టార్ హీరోల సినిమాలకే భరోసా లేదు

    సినిమా ఇండస్ట్రీ అనేది ప్రస్తుతం చాలా పోటీతో కూడుకుంది. స్టార్ హీరోల సినిమాలకు కూడా భరోసా ఉండటం లేదు. ఇక వారి పిల్లల సినిమాలకు ఎక్కడ ఉంటుంది. ఇక్కడ చాలా కష్టపడాలి, అదే సమయంలో పరిస్థితులు కూడా మనకు అనుకూలించాలి అని నాగార్జున తెలిపారు.

    English summary
    Officer is an upcoming 2018 Telugu, Action Crime film, produced and directed by Ram Gopal Varma on his R Company Production banner. The film stars Nagarjuna Akkineni, Myra Sareen in the lead roles and music composed by Ravi Shankar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X