»   » అందుకే మీసం తీసేశాను.. అమ్మాయిలు ఫిదా .. నాగార్జున (ఇంటర్వ్యూ)

అందుకే మీసం తీసేశాను.. అమ్మాయిలు ఫిదా .. నాగార్జున (ఇంటర్వ్యూ)

Written By:
Subscribe to Filmibeat Telugu
Nagarjuna Speaks To Media Exclusively That October Month Is Very Special For Me

అక్కినేని నాగార్జున‌, స‌మంత‌, శీర‌త్‌క‌పూర్ ప్ర‌ధాన తారాగ‌ణంగా పివిపి సినిమా, మాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రై.లి. బేన‌ర్స్‌పై ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం రాజుగారి గ‌ది2. సినిమా అక్టోబ‌ర్ 13న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా అక్కినేని నాగార్జున మీడియాతో చెప్పిన విశేషాలు ఇవే..

మీసం తీసేసిన నాగార్జున

మీసం తీసేసిన నాగార్జున

మీసం తీసేసిన నాగార్జున కొత్త లుక్‌తో కనిపించారు. మీసం తీసేయడం వెనుక కారణం అడుగగా.. ప్రత్యేకత ఏమీ లేదు. రాజు గారి గది2 సినిమాకు సంబంధం లేదు. ఈ ఏడాది సినిమా షూటింగ్‌లు లేవు. అందుకే మీసాలు తీసేశాను. అమ్మాయిలందరూ ఇష్టపడుతున్నారు. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి కొత్తగా ఉంది. కొత్తగా ట్రై చేయాలని ప్రయత్నించా. నాగచైతన్య, అఖిల్‌కు పోటీ కాదు అని నాగార్జున వెల్లడించారు.

కొత్త క్యారెక్ట‌ర్‌లో...

కొత్త క్యారెక్ట‌ర్‌లో...

'రాజుగారి గది2' సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. సిల్లీ కారణాలు కనపడవు. ఇందులో మెంటలిస్ట్‌ క్యారెక్టర్‌లో కనపడతాను. ఆత్మకు, నాకు ఉన్న హ్యుమన్‌ రిలేషన్‌ ఏంటి? అనేది సినిమాలో చూడాలి. కొత్త కథ. నాకు కాన్సెప్ట్‌ నచ్చగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. కొత్త డైలాగ్స్‌, కొత్త క్యారెక్టర్‌తో కొత్తగా కనపడతాను. మలయాళం సినిమా నుండి ఇన్‌స్పిరేషన్‌ తీసుకున్నాం. మన స్టయిల్లో కథను మలుచుకున్నాం. అశ్విన్‌, వెన్నెలకిషోర్‌, షకలక శంకర్‌ కామెడీ ట్రాక్‌ చాలా బాగా నవ్విస్తుంది.

స‌మంత క్యారెక్ట‌ర్ గురించి....

స‌మంత క్యారెక్ట‌ర్ గురించి....

సమంత క్యారెక్టర్‌ చాలా బావుంటుంది. చివరి 20 నిమిషాలు మా ఇద్దరి మధ్య డిస్కషన్‌ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. మనం సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఓ మంచి ఫీలింగ్‌ ఎలా కలిగిందో, ఈ సినిమాకు కూడా అలాంటి ఫీలింగే కలిగింది. రావురమేష్‌గారు సమంత తండ్రి పాత్రలో కనపడతారు.

మంచి పాత్ర‌లు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి...

మంచి పాత్ర‌లు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి...

మంచి మంచి క్యారెక్టర్స్‌ వెతుక్కుంటూ వస్తున్నాయి. ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా, ఇప్పుడు రాజుగారి గది2 ఇలా మంచి మంచి సినిమాలు, పాత్రలు వస్తున్నాయి. ఓ యాక్టర్‌గా నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే అన్నీ చక్కగా కుదిరితే నానితో మరో మంచి సినిమా చేస్తాను. అందులో కూడా నా క్యారెక్టర్‌ సూపర్బ్‌గా ఉంటుంది.

`హాలో` సినిమా గురించి...

`హాలో` సినిమా గురించి...

అక్టోబర్‌ 15న హలో షూటింగ్‌ పూర్తి చేసేస్తానని దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ చెప్పారు. డిసెంబర్‌ 22న సినిమా విడుదలవుతుందని ముందే థియేటర్స్‌కు కూడా చెప్పేసుకున్నాం. డైరెక్టర్‌ విక్రమ్‌కు ఉదయం, సాయంత్రం ఫోన్‌ చేస్తున్నాను. ఏమైందని అడుగుతున్నాను. బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీ. సినిమా చాలా బాగా వస్తుంది. ప్రియదర్శిన్‌గారి అమ్మాయి కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ప్రియదర్శిన్‌గారు నాతో, అమలతో నిర్ణయం సినిమా చేశారు. ఈ మధ్య ఆయన నాకు ఫోన్‌ చేసి అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

English summary
October Month is very special for Nagarjuna Akkineni. Nag's son Naga Chaitanya, Samantha are getting marriage on October 6 and 7th. In these occasion, Nagarjuna speaks to media exclusively. Those interview inputs for Telugu Filmibeat viewers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu