twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా ఆడకపోతే నన్నొక్కడినే కొట్టొద్దు: ‘ఆఫీసర్’ ప్రెస్‌మీట్లో ఆర్జీవీ

    By Bojja Kumar
    |

    నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్ కంపెనీ బేనర్లో రూపొందిన చిత్రం 'ఆఫీసర్'. జూన్ 1న చిత్రం సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో గురువారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

    ఆర్జీవి, నేను కలిసి చేసిన ఒక వెరీ సిన్సియర్ ఎఫర్ట్. ఒక ఆఫీసర్ క్యారెక్టర్ మీద సిన్సియర్‌గా సినిమా తీద్దామనుకున్నాం. ఈ సినిమా తీసే జర్నీలో చాలా ఎంజాయ్ చేశాం. రేపు మా డెస్టినేషన్ రీచ్ అవ్వబోతున్నాం. ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాను. రేపు కూడా అందరం చాలా హ్యాపీగా ఉంటాననే కాన్ఫిడెంట్‌ ఉంది అని నాగార్జున తెలిపారు.

    సినిమా మానేసి వెళతాడనే భయం ఉండేది

    సినిమా మానేసి వెళతాడనే భయం ఉండేది

    రామ్ గోపాల్ వర్మ నా దగ్గరకు సంవత్సరన్నర క్రితం నా దగ్గరకు వచ్చినపుడు స్టోరీ నచ్చింది. కానీ అపుడు ఆర్జీవి మీద నమ్మకం లేదు. నమ్మకం లేక పోవడం అంటే అతడి టాలెంట్ మీదో, డైరెక్టర్ గా అతడి కేపబిలిటీ మీద కాదు. తను వైల్డ్ హార్స్. ఎప్పుడు ఎక్కడికి వెళతాడో తెలియదు. రెండు మూడు నెలల తర్వాత నాకు వేరే ఏదో ప్రాజుక్టు వచ్చింది అని చెప్పి ఇది మనేసి వెళతాడనే భయం ఉండేది. అతడికి ఐడియాస్ చాలా స్పీడుగా తిరుగుతా ఉంటాయి. నాకేమో ఆ అలవాటు లేదు. ఒక పని మొదలు పెడితే దాని ఫినిష్ చేసిన తర్వాత మరో దానికి వెళదామని ఉంటుంది... అని నాగార్జున తెలిపారు.

     అతడిని టెస్ట్ చేసేందుకే అలా చేశా

    అతడిని టెస్ట్ చేసేందుకే అలా చేశా

    కథ చెప్పడానికి వచ్చినపుడు అతడికి ఒకటే చెప్పాను. మనం ఇంత వరకు ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఈ సినిమా మొదలైన తర్వాత నువ్వు మధ్యలో వెళ్లిపోతే మన మధ్య స్నేహం దెబ్బతింటుంది అని చెప్పాను. దానికి ఆర్జీవి ఏమీ అనకుండా మరో నాలుగైదు నెలల తర్వాత వచ్చి కలిశాడు. అదే సిన్సియారిటీతో, అదే పాషన్ తో మళ్లీ అదే కథ చెప్పాడు. నేను మళ్లీ రామూను ఇంకొన్ని రోజులు వేయిట్ చేయి, ఇంకా స్క్రిప్టు డెవలప్ చేయి అని చెప్పి పంపాను. అది నాకు చేయడానికి ఇష్టం లేక కాదు, రామూను నాకు తెలిసిన విధానంలో టెస్ట్ చేసుకున్నాను. తనకు కంటిన్యూటీ ఉందా? మళ్లీ మారిపోతాడా? అని టెస్ట్ చేశాను. నమ్మకం ఏర్పడిన తర్వాత గతేడాది ఆగస్టు, సెప్టెంబర్లో సినిమా చేయాలని ఇద్దరం డిసైడ్ అయ్యాం. నాకు కూడా సిన్సియర్‌గా తీస్తాడనే కాన్ఫిడెన్స్ వచ్చిందని.. నాగార్జున అన్నారు.

    రేపు ఎలాంటి రిజల్ట్ వచ్చినా ఫర్వాలేదు

    రేపు ఎలాంటి రిజల్ట్ వచ్చినా ఫర్వాలేదు

    రాము కాస్త తెలివిగలవాడు కాబట్టి నా మైండ్‌లో ఉన్న డౌట్ అర్థం చేసుకుని సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక లెటర్ రాశాడు. అందులో చాలా బూతులు ఉన్నాయి కాబట్టి ఇపుడు చదవి వినిపించలేను. అయితే సినిమా నేను చెప్పిన విధంగా చేయక పోతే *** తన్నమని చెప్పాడు. సినిమా పూర్తయిన తర్వాత అతడిని తన్నాల్సిన అవసరం లేదనిపించింది. ఔట్ పుట్ మీద చాలా సంతోషంగా ఉన్నాను. రేపు రిజల్ట్ ఉన్నా... లేక పోయినా.. ఎలా ఉన్నా ఫర్వాలేదు. చాలా సిన్సియర్ గా చేశాం.... అని నాగ్ వెల్లడించారు.

     సినిమాలో సౌండ్ ఎపెక్ట్స్ ప్రత్చేకం

    సినిమాలో సౌండ్ ఎపెక్ట్స్ ప్రత్చేకం

    సినిమాలో సౌండ్స్ మిమ్మల్ని చాలా ఎంటర్టెన్ చేస్తుంది. వర్మకు ఫిల్మ్ మేకింగ్‌లో టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉంది. ఎడిట్ సెన్స్ కానీ, సౌండ్ తో ఆడుకునే పద్దతి, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అతడి టేస్ట్ సూపర్. శివ రిలీజ్ అయిన సమయంలో అందరూ సౌండ్ చాలా బావుంది అని మాట్లాడుకున్నారు. అపుడు అది మోనో ట్రాక్ లో జరిగింది. అప్పటికి స్టీరియో కూడా లేదు. ఇపుడు డాల్బీ అట్మాస్ లాంటి డిజిటల్ సౌండ్ అందుబాటులోకి వచ్చింది. నేను ఇంతగా చెబుతున్నానంటే సినిమాలో సౌండ్ ఎంత బావుంటుందో ఒకసారి ఇమేజైన్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది.... అని నాగార్జున తెలిపారు.

    ఈ మూవీ హిట్టయితే వర్మతో మరో సినిమా చేస్తా

    ఈ మూవీ హిట్టయితే వర్మతో మరో సినిమా చేస్తా

    ఈ సినిమా విషయంలో మేము ఎంత సాటిస్పై అయ్యామని మొత్తుకున్నా... జనాలకు నచ్చకపోతే మాలో సాటిఫ్యాక్షన్ ఉండదు. తప్పకుండా డిసప్పాయింట్ అవుతామని నాగార్జున తెలిపారు. సంవత్సరం తర్వాత ఆర్జీవి ఇంకో స్క్రిప్టు వస్తే మళ్లీ టెస్ట్ పెడతారా? కళ్లు మూసుకుని ఒప్పుకుంటారా? అనే ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ... అపుడు ఆర్జీవి మెంటల్ స్టేటస్ బట్టి నిర్ణయం తీసుకుంటా. ఈ సినిమా హిట్టయితే మా కాంబినేషన్ తప్పకుండా రిపీట్ అవుతుంది అని నాగార్జున తెలిపారు.

    ట్విట్టర్లో నేను వైల్డ్ మంకీని

    ట్విట్టర్లో నేను వైల్డ్ మంకీని

    నాగార్జున నన్ను రెండు సార్లు మానిప్యులేట్ చేశాడు. ఇందాక చెప్పినట్లు 6 నెలల తర్వాత కంటిన్యూస్‌గా నన్ను టెస్ట్ చేసి వీడి మైండ్ తిన్నగా ఉందా? లేదా? అనేది అంందులో ఒకటి. రెండో మానిప్యులేషన్ ఇప్పుడే చేశాడు. నాకు ఫస్ట్ అవకాశం ఇస్తే మైక్ లాగేసుకుని, నేను చెప్పాల్సిన చాలా విషయాలు తను చెప్పేశాడు. నాగార్జున చెప్పినట్లు సినిమాల విషయంలో నేను వైల్డ్ హార్స్, అదే విధంగా ట్విట్టర్ విషయంలో వైల్డ్ మంకీ... అని వర్మ వెల్లడించారు.

    నాగ్ చెప్పిన ఆ విషయం కరెక్ట్ కాదు

    నాగ్ చెప్పిన ఆ విషయం కరెక్ట్ కాదు

    నాగార్జున చెప్పినట్లు.....సినిమా అనేది నేను సీరియస్‌గా తీసుకోను అనేది కరెక్ట్ కాదు. ఆఫీసర్ విషయంలో ఒక ఇంటెన్షన్, ఇక రియలిస్టిక్ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఆల్రెడీ మనలో ఇంటెన్షన్ ఉన్నపుడు సినిమాకు ఒకలా పని చేస్తాం. అది లేకుండా సినిమా ఐడియా వచ్చింది ఏదో ఐడియా స్టార్ట్ చేద్దాం అన్నపుడు కూడా మంచి సినిమా రావొచ్చు. అలా అయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ సినిమా ప్రత్యేకం. ఇందులో ఎక్ట్స్ ట్రా కేర్ తీసుకున్నాను. నమ్మకంగా చేశాను కాబట్టే ఫైనల్ కాపీ చూసిన తర్వాత నేను చెప్పినట్లు తీశానని అనిపించకపోతే తన్నమని నాగార్జునకు మెసేజ్ పెట్టాను.... అని వర్మ తెలిపారు.

     సినిమా ఆడక పోతే నన్నొక్కడినే కొట్టొద్దు

    సినిమా ఆడక పోతే నన్నొక్కడినే కొట్టొద్దు

    నా విన్నపం ఏమిటంటే... రేపు ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాకపోతే నాగార్జున ఫ్యాన్స్ నన్ను ఒక్కడినే కొట్టొద్దు... ఎందుకంటే నేను బాగా తీశానని నాగార్జున చెప్పిన విషయాన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాలి అని వర్మ చమత్కరించారు. 25 ఏళ్ల క్రితం ‘శివ' సమయంలో నాకు, నాగార్జున మధ్య ఉన్న సినర్జీకంటే కూడా ‘ఆఫీసర్' సినిమా విషయంలో ఎక్కువగా ఉంది. ఈ సినిమా విషయంలో ఓపెన్ గా మాట్లాడుకుని, ఏది బావుంది, ఏది బాగోలేదని డిస్క్రషన్ చేసి ఈ సినిమా చేశాం. ఈ సినిమాపై చాలా నమ్మకంగా, ఆనందంగా ఉన్నాను. 100 శాతం ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఆడియన్స్ కు వస్తుందని నమ్ముతున్నాను... అని వర్మ తెలిపారు.

    English summary
    Nagarjuna and RGV's OFFICER Press Meet details . Officer is an upcoming 2018 Telugu, Action Crime film, produced and directed by Ram Gopal Varma on his R Company Production banner. The film stars Nagarjuna Akkineni, Myra Sareen in the lead roles and music composed by Ravi Shankar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X