»   » ‘భాయ్’ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి?

‘భాయ్’ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన 'భాయ్' చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. మళయాల సూపర్ హిట్ 'పొక్కిరి రాజా' మెయిన్ ప్లాట్ తీసుకుని చేసిన ఈ చిత్రం తొలిరోజు మంచి ఓపెన్సింగ్స్ సాధించింది. 

నాగార్జున స్టార్ ఇమేజ్‌కు తోడు పూలరంగడు, అహనాపెళ్లంట లాంటి హిట్ చిత్రాలు చేసిన దర్శకుడు వీరభద్రం చౌదరి తెరకెక్కించిన చిత్రం కావడంతో సినిమాపై ముందు నుంచీ మంచి అంచనాలు ఉండటంతో, ఓపెనింగ్స్ అదిరిపోయాయి. భాయ్ చిత్రాన్ని దాదాపు 900 స్క్రీన్లలో విడుదల చేసారు. తొలిరోజు అన్ని థియేటర్లలో 65% నుంచి 80 శాతం ఆక్యుపెన్సీ సాధించింది.

సినిమా విడుదల ముందు నుంచే నాగార్జున సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తుండటం, ప్రోమోలు ఆకట్టుకునే విధంగా ఉండటం, ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టు అనే ప్రచారంతో 'భాయ్‌' సినిమా ఓపినింగ్స్ కు కలిసి వచ్చింది. సినిమాలో నాగార్జున గ్లామరస్‌గా కనిపించాడు. దర్శకుడు సినిమాను హ్యాండిల్ చేయడంలో తనదైన స్టైల్ చూపించాడు.

కామెడీ సీన్లు ఓమోస్తరగా పండినప్పటికీ కథ పరంగా కాస్త వీక్ ఉండటంతో క్రిటిక్స్ నుంచి ఆశించిన రేంజిలో రేటింగ్ రాలేదు. ప్రేక్షకులు నుంచి మాత్రం ఫర్వాలేదనే టాక్ వస్తోంది. తొలి వారం పూర్తయితే తప్ప...సినిమా రిజల్ట్‌ను పూర్తిగా అంచనా వేయలేం.

English summary
Akkineni Nagarjuna's latest outing Bhai, which has hit the marquee today, has got good opening at the worldwide Box Office. With no big competitor, the Veerabhadram Choudary-directed movie was expected to do a record breaking collection at the ticket counters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu