»   » నాగార్జున ‘భాయ్’ సెన్సార్ రిపోర్ట్

నాగార్జున ‘భాయ్’ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కింగ్ నాగార్జున హీరోగా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన 'భాయ్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అక్టోబర్ 25న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

డమరుకం తర్వత నాగార్జున నటించిన సినిమాలేవీ రాక పోవడంతో ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను తెరకెక్కించారు.

ఈ చిత్రంలో సోనూ సూద్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, ప్రసన్న, జయప్రకాష్ రెడ్డి, అజయ్, నథాలియా కౌర్, కామ్న జఠ్మలానీ, హంసా నందిని, నాగినీడు, జారాషా, వినయప్రసాద్, సంధ్యా ఝనక్, చలపతిరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, పృథ్వి, దువ్వాసి మోహన్, శ్రావణ్, సుప్రీత్, ప్రభాస్ శ్రీను, కాశీ విశ్వనాథ్, హేమ, రజిత, గీతాంజలి, టార్జాన్, నర్సింగ్ యాదవ్, ఫిష్ వెంకట్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్.సాయిబాబు, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, మాటలు: సందీప్, రత్న బాబు, కళ: నాగేంద్ర, యాక్షన్: విజయ్ డ్రాగన్ ప్రకాష్, నృత్యాలు: బృందా, గణేష్ స్వామి, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, మాటలు: రత్ బాబు, సందీప్, కథ-దర్శకత్వం: వీరభద్రం చౌదరి.

English summary
Nagarjuna’s ‘Bhai’ has completed its censor formalities today. As per the latest reports that have reached us, the movie has received a U/A rating from the censor board.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu