»   » నవ్వించే...(భాయ్‌ ప్రివ్యూ)

నవ్వించే...(భాయ్‌ ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున హీరోగా నటించిన చిత్రం 'భాయ్‌'. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్. సోనూ సూద్‌ విలన్. హంసా నందిని, నథాలియా కౌర్‌, కామ్న జఠ్మలానీ ప్రత్యేక గీతంలో తళుక్కున మెరవనున్నారు. వీరభద్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం ఈ రోజు(అక్టోబర్ 25)న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

కథలో ...హాంకాంగ్‌లో డేవిడ్‌ (ఆశిష్‌ విద్యార్థి) పెద్ద డాన్‌. మాఫియా కింగ్‌గా ఎదగడమే అతని లక్ష్యం. హాంకాంగ్‌ ప్రభుత్వాన్ని సైతం శాసిస్తుంటాడు. అతని కుడి భుజం.. విజయ్‌ (నాగార్జున). డేవిడ్‌కి ఇద్దరు కొడుకులు. వారి వల్ల విజయ్‌ జీవితం మలుపు తిరుగుతుంది. డేవిడ్‌ కంటే పెద్ద డాన్‌గా మారతాడు. 'భాయ్‌'గా ఎదుగుతాడు. ఓ సందర్భంలో ఇండియా వస్తాడు విజయ్‌. ఇక్కడ రాధిక (రిచా) పరిచయం అవుతుంది. ఆ తరవాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? భాయ్‌ ఎలా మారాల్సి వచ్చింది అనేదే కథ.

దర్శకుడు మాట్లాడుతూ ''నేను ఇప్పటివరకు చేసిన రెండు చిత్రాలు విజయవంతమయ్యాయి. మూడో చిత్రం స్టార్ హీరోతో చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ చిత్రం కూడా తప్పక విజయవంతమై నాకు హ్యాట్రిక్ హిట్‌ను అందిస్తుంది. కష్టాన్ని నమ్ముకునే మనస్తత్వంతో ఉన్న నేను ఈ చిత్రానికి పడిన కష్టానికి ఫలితాన్ని తప్పక అందుకుంటాను.ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. పంచ్‌ డైలాగులు ప్రాణం. నాగార్జునని మూడు విభిన్నమైన కోణాల్లో చూపించాం. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు ఆకట్టుకొంటున్నాయి. వాటి చిత్రీకరణ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణలు పంచిన వినోదం మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకొని నవ్వుకొనేలా ఉంటుంది. ''అన్నారు.

సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్‌
నటీనటులు: నాగార్జున, రిచా గంగోపాధ్యాయ, సోనూసూద్‌, ఆశిష్‌ విద్యార్థి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, రఘుబాబు, కామ్నాజెఠ్మలానీ, హంసానందిని, నథాలియా కౌర్‌ తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌,
నిర్మాత: నాగార్జున
కథ, కథనం, దర్శకత్వం: వీరభద్రమ్‌
విడుదల: 25-10-2013.

English summary
Nagarjuna's "Bhai" is all set to have a grand worldwide release on today(25 October).Directed by Veerabhadram Chowdary of "Poolarangadu" fame, "Bhai" is deemed as an action-comedy entertainer with all the commercial elements needed for a successful film. According to reports, the comedy quotient in the film is expected to be one of the highlights. The pre-release buzz for "Bhai" has been positive and the film is expected to take a fantastic opening on the first day as there are no other big releases.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu