»   » నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్ కు అరుదైన కానుక

నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్ కు అరుదైన కానుక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కింగ్‌ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన అద్భుతమైన చిత్రాలన్నింటితో కలిపి పోస్టల్‌ స్టాంపును సోమవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక ఫొటోను విడుదల చేశారు. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్‌మహల్‌, దాని పక్కన కింగ్‌ నాగార్జున ఫొటో ఉన్న పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

మరో ప్రక్క టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. తన పుట్టినరోజు వేడుకలను అభిమానులతో పంచుకునేలా ప్లాన్ చేసుకున్నారు నాగ్.

Nagarjuna's collectable postal stamps

ప్రస్తుతం నాగార్జున ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఓం నమోః వెంకటేశాయ చిత్రంలో విశిష్ట భక్తుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రంలోని నాగార్జున పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. శ్రీవారి భక్తుడిగా బాబా హథీరామ్‌ పాత్రలో నాగార్జున కన్పించనున్నారు. ఇప్పటికే కృష్ణమ్మగా అనుష్క, వేంకటేశ్వరస్వామి పాత్రలో సౌరభ్‌జైన్‌ల ఫస్ట్‌లుక్‌లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఏ.మహేశ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

English summary
Nag's Collectable Postal Stamp to be launched today on his Birthday, Fans Set to Celebrate their Idol’s Birthday in a Big Way
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu