twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనే మూడు సార్లు కిందపడి లేచా:నాగార్జున

    By Srikanya
    |

    హైదరాబాద్: ఇక్కడ చిన్నా పెద్దా ఎవరూ ఉండరు. నా కెరీర్‌లో నేనే మూడు సార్లు కిందపడి పైకి లేచా. సాయి అంటే సాక్షాత్తూ ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని చేతిలో డమరుకం త్వరలో మోగబోతోంది. ఈ కథ, గ్రాఫిక్స్, టోటల్‌గా ఈ సినిమానే ఒక అద్భుతం అని నాగార్జున అన్నారు. నాగార్జున, అనుష్క జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న 'డమరుకం' ఆడియో ఆవిష్కరణ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. కె.రాఘవేంద్రరావు సీడీలను ఆవిష్కరించి, తొలి ప్రతిని రాజమౌళి, వినాయక్‌లకు అందించారు. ఈ సందర్భంగా నాగార్జున ఇలా స్పందించారు.

    అలాగే...''దేవిశ్రీప్రసాద్‌తో నాది హిట్ కాంబినేషన్. ఈ సినిమా ఫస్ట్ కట్ చూసి పూనకం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదని చెప్పాడు తను. 'శిరిడిసాయి' ప్రభావంలో ఉన్న నాతో 'సక్కుబాయ్ గరం చాయ్' అంటూ హుషారైన పాట చేయించాడు. ఇందులో క్లైమాక్స్ పాట నా ఫేవరెట్. శ్రీనివాసరెడ్డి చిన్న దర్శకుడు కాదు. చాలా పెద్ద దర్శకుడు.చిన్న దర్శకులు, పెద్ద దర్శకులు అనే తేడాలు నాకు లేవు. వాళ్ల దగ్గర ప్రతిభ ఉంటే చాలనుకొంటాను అన్నారు'' అక్కినేని నాగార్జున.

    ఇక నా అభిమానులను చూసి ఎప్పుడూ గర్వపడుతుంటాను. నేను ఎప్పుడు, ఎలాంటి ప్రయత్నం చేసినా వారు ప్రోత్సహిస్తూనే ఉంటారు. పాతికేళ్ల నుంచి వెన్నంటే ఉన్నారు. సాయి, ఈశ్వరులతోపాటు అభిమానుల అండ ఉండటంతో ముందుకు వెళ్తూనే ఉంటాను. అక్టోబరులో డమరుకం మోగుతుంది. స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ చక్కగా కుదిరాయి. దేవిశ్రీ డమరుకంలోని కొన్ని సన్నివేశాలు చూసి అరగంట మాట్లాడాడు. ఈ సినిమాతో అతను యాభై చిత్రాల మైలురాయికి చేరడం ఆనందంగా ఉంది''అన్నారు.

    డమరుకంతో నాగ్ తన కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని రాజమౌళి చెప్పారు. ఈ వేదికపైనే ఛార్మి, గాయని మమతా శర్మ 'సక్కుభాయ్‌ గరమ్‌ ఛాయ్‌' అనే పాటకు నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో నాగచైతన్య, అఖిల్‌, సుశాంత్‌, బ్రహ్మానందం, చంద్రబోస్‌, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి, జొన్నవిత్తుల, సాహితి, బెల్లంకొండ సురేష్‌, కె.అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, సురేష్‌రెడ్డి, బి.జయ, వీరభద్రమ్‌, దేవా కట్టా తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Nagarjuna's Damarukam audio function was a grand affair that was attended by many top film industry personalities. Ace director S.S.Rajamouli. Raghavendra Rao, Vinayak, Charme, Naga Chaitanya, Akhil etc spoke at the event and wished Nagarjuna the very best.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X