For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భారీ ఫాంటసీ ('డమరుకం'ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : వాయిదాలు మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్న నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' ఈ రోజు విడుదల అవుతోంది.'ఢమరుకం' చిత్రం మీద చాలా సినిమాల బరువు పడిందని, అందులో తన కుటుంబ సభ్యుల సినిమాలు కూడా వున్నాయని నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన ఈ చిత్రం ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. నాగార్జున అయితే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని,ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందని చెప్తూ వస్తున్నారు.

  'ఢమరుకం'కథ ఏమిటంటే...తెలుగు పురాణేతిహాసాల ఆధారంగా తయారుచేసుకున్న కథాంశమిది. రాక్షససంహారం జరిగిన తర్వాత శత్రుశేషంగా అంధకాసురుడు అనే రాక్షసుడు ఒక్కడే మిగిలిపోతాడు. వెయ్యి సంవత్సరాలకొక్కసారి గ్రహాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి విశ్వంలో ఓ మహాద్భుతఘట్టం సాక్షాత్కరించే సమయంలో అంధకాసురుడు తిరిగి జన్మిస్తాడు. ఆ పవిత్ర ఘడియల్లో పుట్టడం వల్ల పంచభూతాలు అతని ఆధీనంలోకి వస్తాయి. అతన్ని శివుడి అంశతో జన్మించిన ఓ యువకుడు నిలువరించి లోకకల్యాణం ఎలా చేశాడు. గ్రహాలన్నీ ఒక్కటైనా ఆ పవిత్ర ముహూర్తంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నది హీరో ఆశయం. ఎలా వివాహం చేసుకున్నాడు అనేది సినిమా కథ. ఈ చిత్రంలో అంధకాసురుడి పాత్రను రవిశంకర్ పోషించారు. మానవరూపంలో వున్న శివుడిగా ప్రకాష్‌రాజ్ కనిపిస్తారు.

  ఈ చిత్రంలో నాగార్జున పాత్ర పేరు మల్లికార్జున. అందరూ మల్లి అని పిలుస్తుంటారు. 'హలో బ్రదర్'లోని మాస్ కేరెక్టర్‌లా ఫుల్ జోష్‌తో ఉంటుంది. డబ్బు కోసం ఏమైనా చేసే పాత్ర. అనుష్క పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక 'బొమ్మాళి' రవి చేసిన పాత్ర అయితే ఎక్స్ లెంట్. తన హావభావాలు, డైలాగ్ డిక్షన్ చూస్తే 'మాయాబజార్'లో ఎస్వీఆర్‌గారు గుర్తుకొస్తారు.

  ఈ చిత్రంలో సిజీ విలన్ తో పోరాటమే హైలెట్ గా ఉంటుంది అంటున్నారు. ఈ చిత్రంలో కేవలం గ్రాఫిక్స్ కోసమే ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. రెండు గంటల ఇరవై ఐదు నిముషాలు నిడివి ఉన్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ డబ్బై నిముషాలు ఉంటాయి. అలాగే క్లైమాక్స్ లో వచ్చే 18 అడుగుల అంధకాసురుడు అనే పాత్రతో ఫైట్ సినిమాకి హైలెట్ అవుతుందంటున్నారు. 18 నెలలు పాటు 150 మంది కేవలం ఈ గ్రాఫిక్స్ కోసమే పనిచేసినట్లు దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెప్తున్నారు.

  నాగార్జున ఈ చిత్రం పై మంచి కాన్పిడెంట్ గా ఉన్నారు..ఆయన మాట్లాడుతూ..."డమరుకం చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతం. 'ఈగ' స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని మించి 'డమరుకం' ఉంటుంది'' అని చెప్పారు. ఈ చిత్రం గురించి దర్సకుడు మాట్లాడుతూ.. ''నాగార్జున పాత్ర విభిన్నమైన రీతిలో ఉంటుంది. ఆయన తొలిసారి సోషియో ఫాంటసీ తరహా చిత్రంలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా గ్రాఫిక్స్‌ ఉంటాయి. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో తెరకెక్కించాము''అని ధర్శకుడు తెలిపారు.

  నటీనటులు: నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్, వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, యంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు తదితరులు
  కథ: వెలిగొండ శ్రీనివాస్,
  ఆర్ట్: అశోక్,
  ఎడిటింగ్: గౌతంరాజు,
  డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి: చోటా కె.నాయుడు,
  సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
  డాన్స్: రాజు సుందరం,
  సమర్పణ: కె. అచ్చిరెడ్డి,
  నిర్మాత: వెంకట్,
  స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి

  English summary
  Akkineni Nagarjuna's much awaited film Damarukam, whose release was postponed twice earlier, finally releasing todya. Directed by Srinivas Reddy, the socio-fantasy film also stars Anushka Shetty. Ganesh Venkatraman plays the antagonist. It's touted to be the most expensive film in Nag's career and the computer graphics running into 70 minutes are a major highlight.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X