twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా మంచి నిర్ణయాల్లో ఇదీ ఒకటి:నాగార్జున

    By Srikanya
    |

    Nagarjuna's Geethanjali Movie Completes 25 Years
    హైదరాబాద్ : ''పాతికేళ్ల క్రితం అప్పటివరకు సినీ పరిశ్రమలో ఉన్న ప్రమాణాలను కాదని 'గీతాంజలి' ద్వారా కొత్తగా ఆలోచించాను. నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాను నాకందించిన దర్శకుడు మణిరత్నంగారికి, దీన్ని క్లాసికల్‌గా మరల్చిన నా స్నేహితులకు ధన్యవాదాలు'' అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు నాగార్జున.

    నాగార్జున కెరీర్ లో చెప్పుకొతగ్గ చిత్రాల్లో మొదటి వరసలో నిలిచే చిత్రం 'గీతాంజలి'. ఈ సినిమా వచ్చిన కొత్తలో ఇదేంటి నాగార్జున ఇలాంటి సినిమా చేశాడు. అప్పటివరకు డ్రీమ్ బోయ్ గా, యాక్షన్‌ హీరో గా కనిపించిన నాగ్‌ ఇలా అయిపోయాడేంటి అనుకున్నారు. అలా అనుకున్నవాళ్లే సినిమాకు భారీ విజయాన్ని అందించారు. ఈ సినిమా వచ్చి 25 ఏళ్లు అయ్యింది. ఈ సందర్బంగా నాగార్జున నాటి రోజులు గుర్తు చేసుకున్నారు.

    నాగార్జున తాజా చిత్రం విషయానికి వస్తే... అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ కథానాయికలు. అన్నపూర్ణ స్డూడియోస్‌ సంస్థ నిర్మించింది. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌బచ్చన్‌ అతిథి పాత్రలో కనిపిస్తారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. ఎలాంటి ఆర్భాటమూ లేకుండా పాటల్ని నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేసారు. మే 23న 'మనం' ప్రేక్షకుల ముందుకొస్తుంది. అనూప్‌ స్వరాలు అందించారు.

    నాగార్జున మాట్లాడుతూ... ఈ చిత్రం 1920 నుంచి 2030 మధ్య వంద సంవత్సరాలలో జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ చిత్ర కథాంశం ఎంతో వినోద భరితంగా ఉంటుందని తెలిపారు. పునర్జన్మ కోణం లో ఈ చిత్రం ఉంటుందని నాగార్జున అన్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం మే 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

    English summary
    Akkineni Nagarjuna's Geethanjali has completed 25 years with yesterday. The movie was release on May 10, 1989 and created wonders at box office. It is the only movie of director Maniratnam in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X