For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మన్మథుడు2 ఫస్ట్ రివ్యూ.. ప్లేబాయ్‌గా నాగ్.. ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

  |

  టాలీవుడ్ మన్మథుడు నాగార్జున చాలా రోజుల తర్వాత మళ్లీ రొమాంటిక్ హీరో అవతారం ఎత్తాడు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్, రకుల్ ప్రీత్ జంట మన్మథుడు 2 సినిమా మొదలైంది. కామెడి భారాన్ని వెన్నెల కిషోర్‌పై వేసి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా మార్చే ప్రయత్నం చేశారనే మాట ఇండస్ట్రీలో వినిపించింది. ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓవర్సీస్ ప్రీమియర్లు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టాక్ ఇదే..

  ప్లేబాయ్‌గా నాగార్జున

  ప్లేబాయ్‌గా నాగార్జున

  సాంబశివరావు అలియాస్ సామ్‌గా నాగార్జున, అతడి అసిస్టెంట్‌గా వెన్నెల కిషోర్ ఎంట్రీతో మన్మథుడు2 సినిమా ప్రారంభమవుతుంది. మొదటి అఫైర్ బ్రేక్ కావడంతో సామ్ ప్లేబాయ్‌గా మారడం తొలి అంశంగా కథ మొదలైంది. పోర్చుగల్‌లో స్థిరపడిన సాంబశివరావు కుటుంబ నేపథ్యంతో సినిమాలోని కీలక అంశాన్ని వెల్లడించడం జరిగింది. కామెడీకి కాస్త ఎమోషన్ జోడించి కథను లాగించే ప్రయత్నం చేయడం జరిగింది.

  ఫెర్ఫ్యూమ్ వ్యాపారిగా మన్మథుడు

  ఫెర్ఫ్యూమ్ వ్యాపారిగా మన్మథుడు

  నాగ్, వెన్నెల కిషోర్ మధ్య హిలేరియస్ కామెడీ సీన్లు ఫన్నీగా సాగుతున్నది. ఫెర్ఫ్యూమ్ వ్యాపారిగా ఆడవాళ్లంటే ఓ పిచ్చి పాత్ర (ఉమనైజర్)లో నాగార్జున తెర మీద కొత్తగా కనిపించారు. ప్రత్యేమైన పాత్రలో కీర్తీ సురేష్ ఎంట్రీ ఇచ్చింది. వెంటనే హేయ్ మనీనా సాంగ్‌తో రెగ్యులర్ ఫార్మాట్‌లో కథ సాగుతున్నది.

  పెళ్లికాని ప్రసాద్ పాత్రలో కొత్తగా

  పెళ్లికాని ప్రసాద్ పాత్రలో కొత్తగా

  ప్రేమ భగ్నం కావడంతో పెళ్లికి దూరమైన సామ్‌కు మ్యారేజ్ చేసే పనిలో కుటుంబ సభ్యులు పూనుకొన్నారు. లక్ష్మీ, ఝాన్సీ తదితరులతో తెర ఫ్యామిలీ వాతావరణం కనిపించింది. వెస్ట్రన్, ట్రెడిషనల్ అంశాలు మిక్స్ చేస్తూ దర్శకుడు ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించినట్టు కనిపించింది. బేసిక్‌గా ఫీల్‌గుడ్‌గా కథ సాగుతున్నది.

   బార్‌లో పనిచేసే యువతిగా రకుల్ ప్రీత్

  బార్‌లో పనిచేసే యువతిగా రకుల్ ప్రీత్

  పెళ్లి ప్రయత్నాలు ఓ పక్క జరుగుతుంటే రకుల్ ప్రీత్ పాత్ర ఎంట్రీ ఇచ్చింది. బార్‌లో పనిచేసే అమ్మాయిగా కనిపించింది. స్వతంత్ర భావాలున్న యువతి పాత్రను ఎస్టాబ్లిష్ చేసింది. మరోపక్క సమంత ఓ ప్రత్యేకమైన పాత్రలో ఎంట్రీ ఇచ్చింది. దాంతో కథ కొంత ఆసక్తిగా మారినట్టు కనిపించింది.

   అద్దె లవర్‌గా రకుల్ నాటకం

  అద్దె లవర్‌గా రకుల్ నాటకం

  మన్మథుడు2 సినిమా కథను మలుపు తిప్పే అసలు ట్విస్ట్ మొదలైంది. ఫ్యామిలీ ప్రయత్నాలకు భిన్నంగా రకుల్‌తో ప్రేయసిగా నటించేందుకు నాగ్ ప్లాన్ చేశాడు. రెండు నెలలపాటు లవర్‌గా యాక్ట్ చేసేందుకు నాగ్ ఒప్పించి ఇంటికి తీసుకెళ్లాడు. సాంబశివరావు ఫ్యామిలీని రకుల్ ఇంప్రెస్ చేసే సీన్లు ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఈ క్రమంలో రావు రమేష్ రూపంలో ఓ కీలక పాత్ర ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పెళ్లంట పాట తర్వాత.. కథలో కొంత సీరియస్ కంటెంట్ కనిపించింది. సామ్ తల్లి షాకింగ్ హాస్పిటల్‌లో చేరడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడింది.

  నటీనటులు, సాంకేతిక వర్గం

  నటీనటులు, సాంకేతిక వర్గం

  నటీనటులు: నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తీ సురేష్, సమంత, వెన్నెల కిషోర్, లక్ష్మీ, ఝాన్సీ, రావు రమేష్ తదితరులు

  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్

  కథ సహకారం: కిట్టు వాస్సాప్రగడ

  స్క్రీన్ ప్లే సహకారం: సత్యానంద్

  సంగీతం: చైతన్ భరద్వాజ్

  సినిమాటోగ్రాఫర్: ఎం సుకుమార్

  ఎడిటర్: నాగేశ్వర్‌రెడ్డి బీ

  బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18, మనం

  రిలీజ్ డేట్: 2019-08-09

  English summary
  Manmadhudu 2Shoot of King Nagarjuna's 'Manmadhudu 2' started today. Film is being Produced by Akkineni Nagarjuna, P. Kiran on Manam Enterprises, Anandi Art Creations banners Directed by Rahul Ravindran. Senior writer Satyanand handed over the Script to Director Rahul Ravindran. This movie is released on August 9th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X