twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమెరికాలో విడుదలైన రాజన్న...స్టోరీ ఇదే

    By Bojja Kumar
    |

    నాగార్జున నటించిన 'రాజన్న' సినిమా డిసెంబర్ 22న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను అమెరికాలో ఒక రోజు ముందు అంటే ఈ రోజే విడుదల చేశారు. సినిమా స్టోరీ కింది విధంగా ఉంది. 1948 ప్రాంతంలో నేలకొండపల్లిలో చోటు చేసుకున్న యాదార్ధ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.

    తన పాటతో, డప్పు వాయిద్యంతో ప్రజల్లో చైతన్యాన్ని నింపే రాజన్న(నాగార్జున) అతని స్నేహితులు(ప్రదీప్ రావత్, సుప్రీత్, అజయ్) కలిసి బ్రిటిష్ ఎదురు నిలిచి తెల్లదొరలను చంపుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగం అవుతారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజన్న తన సొంత ఊరైన నేలకొండపల్లికి చేరుకుంటారు. లచ్చమ్మ(స్నేహ)ను పెళ్లి చేసుకుంటాడు. వీరి సంతామనమే మల్లమ్మ(బేబి ఆనీ).

    దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం పరిపాలనలో ఉన్న ప్రాంతం(ఇప్పటి తెలంగాణ)కు మాత్రం స్వాతంత్ర్యం రాదు. గ్రామాల్లో దొరల నిరంకుశత్వం సాగుతూ ఉంటుంది. ఇది సహించలేని రాజన్న వారికి ఎదురు తిరుగుతాడు. ఒక్కొక్క దొరను చంపుతూ ముందుకు సాగుతున్న రాజన్న నిజాం మనుషుల చేతిలో బలవుతాడు.

    రాజన్న మరణంతో అతని కుటుంబాన్ని కూడా తుదముట్టించాలని చూస్తారు దొర కుటుంబీకులు. రాజన్న భార్య లచ్చమ్మ ఎలాగో అలా దొరల భారి నుంచి తన కూతురు మల్లమ్మను కాపాడి తాను బలవుతుంది. మల్లమ్మను అదే ఊరిలో ఉండే ఓ తాత కాపాడి తన మనవరాలిగా పెంచుకుంటుంటాడు. అలా పెరిగి పెద్దయిన మల్లమ్మ తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం నింపుతూ ఉంటుంది. ఈ క్రమంలో దొరల ఆగ్రహానికి గురవుతుంది. నేలకొండపల్లిపై పగబట్టిన దొరలు ఊరుమొత్తాన్ని మట్టుబెట్టాలని చూస్తారు. తన ఊరిని కాపాుడకోవడానికి మల్లమ్మ ఢిల్లీ బయల్దేరు తుంది. అప్పటి దేశ ప్రధాని నెహ్రూను కలుస్తుంది. ఆతర్వాత ఏం జరిగిందో థియేటర్లో.....చూసి తెలుసుకోండి.

    అయితే సినిమా మొదలవడం మాత్రమ లచ్చమ్మ దొరల చేతిలో బలవ్వడం, మల్లమ్మను ఓ పెద్దాయన కాపాడటం దగ్గర నుంచి మొదలవుతుంది. ఇంటర్వెల్ కు ముందు రాజన్న(నాగార్జున) ఎపిసోడ్ ప్లాష్ బ్యాక్ గా చూపిస్తారు.

    English summary
    Nagarjuna's Rajanna movie released today in US.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X