»   » నాగ్ 'సోగ్గాడే చిన్ని నాయనా' ట్రైలర్ (వీడియో)

నాగ్ 'సోగ్గాడే చిన్ని నాయనా' ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ...వినోదం, కుటుంబ అనుబంధాల సమాహారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా' . ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలై నాగార్జున అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ ట్రైలర్ మీరు ఇక్కడ చూడండి.


రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరోయిన్స్. వినూత్న కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్నరు. రెండు పాత్రలు సరికొత్త పంథాలో సాగుతాయని చిత్ర యూనిట్ చెబుతోంది.


ఇక మనం చిత్రంతో కథల ఎంపికలో తన పంథాను నాగార్జున మార్చుకున్న సంగతి తెలిసిందే. వైవిధ్యంతో కూడిన కథాంశాలకే ప్రాధాన్యతనివ్వాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా.. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్' తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Nagarjuna's Soggade Chinni Nayana Theatrical Trailer

లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. హంసానందిని, అనసూయ , చలపతిరావు, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రామ్మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

English summary
Nagarjuna mesmerized in the trailer of his upcoming film Soggade Chinnni Nayana. Nag is seen in dual roles as father and son.
Please Wait while comments are loading...