నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫస్ట్ లుక్ (పోస్టర్)
హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నేడు 57వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని నాగార్జున నటిస్తున్న తాజా సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. 60 ఏళ్లకు దగ్గరవుతున్న నాగార్జున ఈ వయసులోనూ మన్మథుడిలా వెలిగి పోతుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున తాత, మనవడు పాత్రల్లో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు పాత్రలకు రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి (‘అందాల రాక్షసి' ఫేం) కథానాయికలుగా నటిస్తున్నారు. నాగార్జున సరసన అనసూయ మరదలి పాత్రలో నటిస్తోందని సమాచారం.

సోగ్గాడే చిన్ని నాయనా షూటింగ్ పూర్తయ్యే వరకు నాన్ స్టాప్ గా సాగుతుంది. లవ్లీ అనసూయ కూడా ఓ ఎంటర్టెనింగ్ సీన్ కోసం షూటింగులో జాయిన్ అయింది అని నాగార్జున తెలిపారు. సినిమాలో నాగార్జున, అనసూయల మధ్య బావా మరదళ్ల సరసాలు, రొమాంటిక్ సీన్లు ఉంటాయని టాక్. నాగార్జునతో కలిసి ఓ పాటలో ఆమె డాన్స్ కూడా చేస్తుందట. హాట్ అండ్ సెక్సీ లేడీ, ఐటం గర్ల్ హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











