twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్యూట్ లవ్ స్టోరీ (‘ఉయ్యాలా జంపాలా’ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమాస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై విరించివర్మ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'ఉయ్యాలా జంపాలా'. ఈ చిత్రం ఈ రోజే విడుదల అవుతోంది. ఈ విభిన్న కథా చిత్రం బావా మరదళ్ల ప్రేమ కథగా రూపొందింది.

    సూరి (రాజ్‌ తరుణ్‌), ఉమాదేవి (అవిక) బావామరదళ్లు. ఒకరంటే మరొకరికి పడదు. ఎప్పుడు ఎదురైనా గొడవే. ఎత్తుకు పైఎత్తులు వేసుకొని కవ్వించుకొంటుంటారు. ఉమాదేవి, పార్థు అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. పార్థు మంచివాడేం కాదు. అతని బారి నుంచి మరదలిని కాపాడుకొంటాడు సూరి. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే ఇరు కుటుంబాల మధ్య ఆస్తులు, అంతస్తుల తారతమ్యం ఉంది. అది వీరి ప్రేమకు ఆటంకం కలిగించిందా? ఈ బావామరదళ్లు కలుసుకొన్నారా? అనేదే ఈ చిత్రకథ.

    Uyyala Jampala

    దర్శకుడు మాట్లాడుతూ.... ''ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ కనుక్కోవడం కూడా కష్టమే. ఎప్పుడూ తిట్టుకొని కొట్టుకొంటున్న వ్యక్తుల మధ్య ప్రేమలేదని చెప్పలేం. మా కథలోని బావామరదళ్ల కథ కూడా ఇంతే. వారిలోని ప్రేమ ఎప్పుడు ఎలా బయటపడింది అనేదే ఈ సినిమాకి కీలకం. నాలుగు పాటలున్నాయి. కానీ సినిమాలో మూడు మాత్రమే వినిపిస్తాయి. 48 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశాం''.

    నాగార్జున మాట్లాడుతూ...''నన్ను చాలారోజులు వెంటాడిన సినిమా ఇది. సినిమా చూసినప్పటి నుంచీ ప్రతీ రోజూ అందులోని సన్నివేశాలు తలచుకొంటూనే ఉన్నా. ఈమధ్య పల్లెటూరి కథలు మనకు ఎక్కువగా రావడం లేదు. ఇది వరకు నేను 'జానకి రాముడు', 'ప్రెసిడెంటు గారి పెళ్లాం' సినిమాలు చేశా. చాలాకాలం తరవాత ఓ స్వచ్ఛమైన పచ్చని పల్లెటూరి వాతావరణం ఈ సినిమాలో కనిపిస్తుంది. కొత్త దర్శకుడైనా ఈ సినిమాని బాగా తీర్చిదిద్దాడు. ఓ మంచి సినిమా వెనుక అన్నపూర్ణ స్డూడియోస్‌లాంటి సంస్థ ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే నిర్మాణ భాగస్వామిగా చేరా'' అన్నారు.

    సురేష్‌బాబు మాట్లాడుతూ...''రామ్మెహన్‌ తీసిన 'అష్టాచమ్మా', 'గోల్కొండ హైస్కూల్‌' సినిమాల వెనుక నేనూ ఉన్నా. సినిమాలపై అతనికి ఉన్న ప్రేమ నాకు తెలుసు. కచ్చితంగా మంచి కథలనే ఎంచుకొంటాడు. అందుకే ఈ సినిమాతో నేనూ చేతులు కలిపా. అవిక ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆమె ఉందికాబట్టే ఈ సినిమాకి ఇంత క్రేజ్‌ వచ్చింది''
    విడుదల: నేడే

    సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్‌, సన్‌షైన్‌ పిక్చర్స్‌
    నటీనటులు: రాజ్‌తరుణ్‌, అవిక, అనితా చౌదరి, రవివర్మ తదితరులు. సంగీతం: సన్నీ ఎం.ఆర్‌.
    ఫొటోగ్రఫీ: విశ్వ డి.బి.,
    ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్,
    కళ: ఎస్.రవీందర్,
    నిర్మాతలు: నాగార్జున అక్కినేని, రామ్మోహన్ పి.,
    సమర్పణ: డి. సురేష్‌బాబు
    దర్శకత్వం: విరించి వర్మ.

    English summary
    Uyyala Jampala directed by newcomer Virinchi Varma will release on December 25th on the occasion of Christmas. Nagarjuna Akkineni who is acting as one of the producers of the film confirmed that the movie hits the screens on 25th of December and audio will be launched on 15th December at Shilpa Kala Vedika in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X